సీఎం కేసీఆర్ పై హనుమంతరావు ఆగ్రహం – Dharuvu
Breaking News
Home / TELANGANA / సీఎం కేసీఆర్ పై హనుమంతరావు ఆగ్రహం

సీఎం కేసీఆర్ పై హనుమంతరావు ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇవాళ అయన మీడీయా తో మాట్లాడుతూ .. కేసీఆర్ కు ఎన్నికలు 15 నెలల ముందు బీసీ లు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు . బీసీ లపై ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్ మంత్రి వర్గంలో నలుగురు బీసీలు ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు .బీసీలపై కేసీఆర్ కు ప్రేముంటే బీసీ మంత్రుల సంఖ్య 9 కి పెంచాలన్నారు .నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌ ఆరోపించారు.