బీజేపీతో వైసీపీ పొత్తు.. సంచ‌ల‌న విషయం తేల్చి చెప్పిన జ‌గ‌న్‌..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / బీజేపీతో వైసీపీ పొత్తు.. సంచ‌ల‌న విషయం తేల్చి చెప్పిన జ‌గ‌న్‌..!

బీజేపీతో వైసీపీ పొత్తు.. సంచ‌ల‌న విషయం తేల్చి చెప్పిన జ‌గ‌న్‌..!

ఏపీలో పాద‌యాత్ర‌తో బిజీగా ఉన్న జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి ఇచ్చిన తాజా ఇంట‌ర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమవుతోందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గాని రాష్ట్రంలో ప్రత్యేక బలం లేదని, ఏదో ఒక పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిందేనని అన్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చంద్రబాబు అండ్ బ్యాచే ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పై అనేక అవినీతి కేసులున్నాయని, అందుకే బీజేపీతో విభేధించరని జగన్ తెలిపారు. అయితే రాజ‌కీయాలు అన్నాక‌ ఏమైనా జరగొచ్చని.., బీజీపీ పైన, మోడీ పైన వ్యతిరేకత ఉంటే చివరి క్షణంలో చంద్రబాబు పొత్తు నుంచి జారుకోవ‌డానికి వెనుకాడ‌ర‌ని చెప్పారు. తాము మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జగన్ తెలిపారు.