చంద్ర‌బాబు బ్యాచ్ అటాక్‌కి.. జ‌గ‌న్ నుండి జ‌బ‌ర్ధ‌స్త్ రియాక్ష‌న్‌..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు బ్యాచ్ అటాక్‌కి.. జ‌గ‌న్ నుండి జ‌బ‌ర్ధ‌స్త్ రియాక్ష‌న్‌..!

చంద్ర‌బాబు బ్యాచ్ అటాక్‌కి.. జ‌గ‌న్ నుండి జ‌బ‌ర్ధ‌స్త్ రియాక్ష‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న‌ పాద‌యాత్ర‌లో.. ప్ర‌జ‌ల‌ కష్టాలన్నిటినీ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ వృత్తిదారులకు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు వాళ్ళ క‌న్నీటి గాధ‌లు.. చంద్ర‌బాబు న‌ర‌క పాల‌న గురించి చెబుతున్నారు ప్ర‌జ‌లు. దీంతో జగన్‌ వస్తే తమ కష్టాలు పోతాయని వారు నమ్ముతున్నార‌ని.. వారి నమ్మకమే నన్ను నడిపిస్తోందని.. అందుకే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. కాళ్ల‌కు బొబ్బ‌లు క‌ట్టినా.. త‌న పాద‌యాత్ర‌ని ఆప‌డం లేదు జ‌గ‌న్‌. అయితే ఒకవైపు పాద‌యాత్ర చేస్తూనే.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జ‌గ‌న్ చంద్ర‌బాబు బ్యాచ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల పై స్పందించారు.

ఏపీలో వ‌చ్చే ఎన్నికల నాటికి వైసీపీలో మీరు ఒక్కరే మిగులుతారని.. ఇంకా ఎవరెవరో వెళ్లిపోతారని.. ఎమ్మెల్యేలంతా వెళ్లిపోతారని టీడీపీ వాళ్లు అంటున్నారు కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంట‌ని అడుగగా.. ఎవరో ఒక ఒక లీడరో, ఒక ఎమ్మెల్యేనో వెళిపోతే పార్టీ ఉండదన్న తప్పుడు అభిప్రాయంతో చంద్రబాబు అండ్ బ్యాచ్ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి ఆలోచన చేయడం మూర్ఖత్వం. 2011లో పార్టీ పెట్టినప్పుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాము.. 175 సీట్లలో పులివెందుల తప్ప మిగతా 174 ఖాళీయే అని… ఆ తర్వాత ప్రజలు దీవించారని., దేవుడు ఆశీర్వదించారని చెప్పారు. ఒక‌ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు మన జెండా మోస్తారు. ఒక నాయకుడు పోతే ఇంకొ నాయ‌కుడు వస్తారు. ప్రజలు వాళ్లవైపు నిలుస్తారు. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలి.. అవతలి మనిషికి 25 కోట్లో, 30 కోట్లో ఇచ్చి పదవుల వ్యామోహం చూపించి తీసుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. చంద్రబాబు లాంటి వ్యక్తులు వాళ్లకు హామీలు ఇవ్వడం, ప్రలోభ పర్చడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేయాల్సిన చట్టసభల్లోని వ్యక్తులే చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉంటే చంద్రబాబు అనుకూల మీడియా ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ ప్రచారం చేస్తుండటం, తప్పును తప్పు అని చెప్పలేకుండా ఉండడం విస్మయం కలిగిస్తోందని జ‌గ‌న్ చెప్పారు. దీంతో చంద్ర‌బాబు బ్యాచ్ చేస్తున్న అటాక్‌కి జ‌గ‌న్ చాలా సింపుల్‌గా అస‌లు విష‌యం తేల్చి చెప్పార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.