Home / POLITICS / మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!

మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు కెసిఆర్ స్వప్నం.కేసీఆర్ పర్యటనకు ఒక రోజు ముందే కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు కీలక సమావేశం భగ్నం కావడం ఎన్ కౌంటర్లో 7 గురు మావోయిస్టులు మరణించిన ఘటన కలకలం రేపింది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా జింగనూర్ ఔట్ పోస్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని కల్లెడ్ గ్రామ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కల్లెడ్ అడవుల్లో గత కొద్దిరోజులుగా మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతం అయ్యాయి. మరోవైపు ఈ పరిణామంతో తెలంగాణ పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు కేవలం 20 కి.మీ.ల దూరంలోనే ఉండటం ఈ కలవరపాటుకు కారణం! ఎన్ కౌంటర్ ప్రభావంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర పోలీసుయంత్రాంగం అప్రమత్తమయ్యింది. గురువారం సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన ఉండటంతో ప్రాజెక్ట్ పరిసరాలన్నింటినీ పోలీసు బలగాలు తమ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దులోని అటవీ ప్రాంతం, రోడ్డు మార్గాలు, గ్రామాల్లో నిఘాను పెంచారు. తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని కోరారు. ఇవతలి ఒడ్డు తెలంగాణ. అవతలి ఒడ్డు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర. ఇవతలి ఒడ్డున్నంత ప్రశాంత వాతావరణం అవతలి ఒడ్డున లేదు. నిత్యం మావోయిస్టు సంచారం, పోలీసులు, మావోయిస్టు కార్యకలాపాలు పోటాపోటీగా సాగుతున్నవి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణా జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటి అమలు తీరును క్షేత్ర స్థాయిలో సమీక్షించారు.రెండేళ్ళ క్రితం వరంగల్ జిల్లాలో గోదావరి నది తీరంలో కెసిఆర్ ఐదు గంటల పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. గోదావరి నదిపై ఏరియల్ సర్వే నిర్వహిస్తే సరిపోతుందని, పరిస్థితుల ప్రభావం మూలంగా అక్కడ దిగే పరిస్థితులు లేవని వివరించాలని, ఎట్లాగైనా సరే సీఎంను అక్కడ ల్యాండ్ కానివ్వొద్దని పోలీసు ఉన్నతాధికారులు అనుకున్నారు.

కంతనపల్లి పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్ అక్కడినుంచి దేవాదుల, కాళేశ్వరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి దేవాదుల ప్రాజెక్టులో ల్యాండ్ అయ్యారు. దేవాదుల ప్రాజెక్టును పరిశీలించి అక్కడే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులతో సమావేశం, సమీక్ష నిర్వహించారు. నిజానికి అవతలి ఒడ్డున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాళ్లగూడెం కనిపిస్తుంది. అది బీజాపూర్ జిల్లాలో ఉన్న గ్రామం. దాని అవతల ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర బస్తర్ జిల్లాలు ఉన్నాయి. మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న దండకారణ్యంలో నెలకొన్న వాతావరణం పోలీసులను కలవరానికి గురిచేసింది. అదే సమయంలో మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా గడ్చిరోలి జిల్లా కూడా తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సిరొంచ-గడ్చిరోలి కమిటీలు విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర మావోయిస్టు కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని పోలీసు నిఘావర్గాల అనుమానం.

దేవాదుల నుంచి ఏటూరునాగారం దాకా వరంగల్ జిల్లాలోనే ఉన్నా.. గత అనుభవాల దృష్ట్యా అది ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ప్రాంతం కిందనే లెక్క అని పోలీసులు, నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేవాదులలో 2008 మార్చి 14న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పర్యటించిన సందర్భాన్ని కొంతమంది పోలీసు అధికారులు గుర్తు చేసుకున్నారు. అప్పుడు యూనిఫాం వేసుకోకుండా విధులు నిర్వర్తించామని అటువంటి వాతావరణం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సాహసోపేతమైన కార్యానికి పూనుకున్నారని పోలీసు, రెవెన్యూ అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా గోదావరితీరం వెంబడి అటు గగన తలంలోనూ ఇటు భూమార్గంలోనూ ప్రయణించి ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పట్లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రజారంజక పాలనంటే హైదరాబాద్ కేంద్రంగా ఉండి పాలన చేయడమే కాదు, ఆ పాలన ఫలాలు ప్రజలకు చేరవేయడం.. తద్వారా ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కల్పించడం అన్న సూత్రాన్ని తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరించిచూపారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.మళ్ళీ ఇప్పుడు కేసీఆర్‌ గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని తుపాలకుగూడెం ఆనకట్ట పనులను పరిశీలించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, అనుబంధ రిజర్వాయర్లలను పరిశీలించారు.తుపాలకులగూడెంలో గోదావరిపై నిర్మించే బ్యారేజీ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పనులను పరిశీలించారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితర అధికారులు, ఇంజినీర్లు కెసిఆర్ వెంట ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల, గోలివాడలో నిర్మించే బ్యారేజీలను, రివర్స్‌ పంపింగ్‌ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. రామగుండం ఎన్టీపీసీలో బస చేశారు.అక్కడ ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 8వ యూనిట్ పనులను పరిశీలించారు. మేడారం ప్యాకేజీ 6, రామడుగు ప్యాకేజీ 8 ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్, సబ్‌స్టేషన్లు, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. 10 డయామీటర్ల డీ ఆకారపు వ్యాసార్థంతో నిర్మించిన మేడారం టన్నెల్‌ను కూడా పరిశీలించారు. మేడారం సర్జ్‌పూల్‌కు చేరిన నీటిని పంప్ చేయడానికి అవసరమైన 7 పంపులను ఏర్పాటు చేశామని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు సి.ఎం.కెసిఆర్ కు తెలిపారు. మేడారంలో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్లను భూగర్భంలో నిర్మించామని సీఎంకు వివరించారు. పంపు సెట్లు తయారు చేస్తున్న బీహెచ్‌ఈఎల్ అధికారులతో సీఎం మాట్లాడారు. డిసెంబర్ నాటికి అన్ని పంపులు అందజేస్తామని సీఎంకు బీహెచ్‌ఈఎల్ సిబ్బంది చెప్పారు.

కన్నెపల్లి నుంచి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిళ్ల ద్వారా మేడారం దాకా నీటిని లిఫ్ట్ చేయడం ముఖ్య ఘట్టమని సీఎం అన్నారు. మేడారం నుంచి లక్ష్మీపూర్ వరకు 15 కిలోమీటర్ల టన్నెల్‌ను 5.7 కిలోమీటర్ల కెనాల్‌ను సీఎం పరిశీలించారు. లక్ష్మీపూర్ వద్ద పంప్ హౌజ్,సర్జ్ పూల్ , 400 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లను వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం సూచించారు. వరద కాల్వ ద్వారా 1 టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీ నీటిని మిడ్ మానేరుకు పంపాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వరద కాల్వ దాకా నీరు పంపు చేసే ప్రక్రియ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు.వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని సీఎం చెప్పారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరకు పంపాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వరద కాల్వ దాకా నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదని, అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా, సకాలంలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. పనులను పరిశీలించే సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కూడా తరచూ పర్యటిస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో రాత్రివేళలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మావోయిస్టులకు షెల్టర్‌జోన్ అయిన ఏజెన్సీకి గతంలో ప్రజాప్రతినిధులు, వీఐపీలు, వీవీఐపీలు పగటిపూట వెళ్లాలంటే అనేక ఆంక్షలు ఉండేవి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ఆదేశాల మేరకు పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లాలా.. వద్దా అనేది నిర్ణయించేది. మంత్రులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం చూస్తే పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తున్నది. వరంగల్-ఖమ్మం సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌గా గుర్తింపు ఉన్నది. అక్కడికి ప్రజాప్రతినిధులు, వీఐపీలు వెళ్లాలంటే పోలీసులకు పెద్ద సవాలే.. లెక్కకు మించి పోలీసుల బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించేవారు. ఎప్పటికప్పుడు వీవీఐపీల కదలికలను గమనిస్తూ బందోబస్తు నిర్వహిస్తుంటారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌తో పాటు ఇతర నేతలు గత ఏడాది ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. రామప్ప, లక్నవరం సరస్సులను సందర్శించారు. ఆపై గోవిందరావుపేట, తాడ్వాయి మండల కేంద్రాల్లో నిర్మించిన మార్కెట్ గోదాములకు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత మంగపేట మండలం గోదావరి పుష్కరఘాట్‌లను పరిశీలించారు. మల్లూరు ప్రాజెక్టులను పరిశీలించి అక్కడి నుంచి అకినెపల్లి, మల్లారం చేరుకుని సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాటి పరిస్థితులను పక్కనబెడితే మావోయిస్టుల ఇలాఖాలో మంత్రులు రాత్రివేళల్లో సైతం పర్యటిస్తూ వస్తున్నారు.

సోర్స్ : Sk Zakeer

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat