Home / INTERNATIONAL / ఈ బుడ్డోడు మామూలోడు కాదు..ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాకే

ఈ బుడ్డోడు మామూలోడు కాదు..ఎన్ని కోట్లు సంపాదించాడో తెలిస్తే షాకే

ఆరేళ్ల చిన్నారి 71 కోట్లు సంపాదించాడు అంటే నమ్మడం లేదా.. అవునండి నిజమే.. ప్రముఖ సంస్థ ఫోర్బ్స్‌ ఈ సంవత్సరానికిగానూ ఒక్కో జాబితాను విడుదల చేస్తున్న క్రమంలో యూట్యూబ్‌ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న స్టార్ల జాబితాలో ఆరేళ్ల చిన్నారి నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం బొమ్మలతో ఆడుకోవటం ద్వారానే అతను సుమారు 71 కోట్లు సంపాదించాడు..అతని చేతికి బొమ్మ చిక్కిందంటే చాలు మొదటగా దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు .అదేంటో.. దాంట్లో ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా అధ్యయనం చేసి వివరిస్తుంటాడు. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి.. ” Ryan ToysReview  ” ర్యాన్‌ టాయ్స్‌రివ్యూ అనే ఓ ట్యూబ్‌ఛానెల్‌ను సృష్టించి అందులో ఆ వీడియోలను అప్‌ డేట్ చేస్తూ వస్తున్నారు.

ఆ ఛానెల్‌కు 10 లక్షల మందికిపైగా సబ్‌ స్క్రైబర్‌లు ఉన్నారు. ఈ ఏడాదికి గానూ 71 కోట్ల సంపాదనతో యూట్యూబ్‌ స్టార్ల లిస్ట్‌లో 8వ స్థానంలో నిలిచాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat