60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ .. – Dharuvu
Home / EDITORIAL / 60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..

60ఏళ్ళ చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్ ..

కేసీఆర్ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల చిరకాల కోరిక అయిన స్వరాష్ట్రాన్ని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కొట్లాడి మరి నెరవేర్చిన ఉద్యమ నేత ..సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతనాలుగుఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ వాళ్ళకు పాలన చేతనైతదా అని విమర్శించిన వాళ్ళ నోళ్ళు మూతపడే విధంగా యావత్తు దేశమే తెలంగాణ పాలనను ఆదర్శంగా తీసుకునే విధంగా పాలిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణ
రాధసారథి .

అంతటి మహోన్నత వ్యక్తిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత అరవై యేండ్ల సమైక్య పాలనను ఎవరు తీర్చలేని ..చేయలేని విధంగా దాదాపు పద్దెనిమిది వేల కుటుంబాల సమస్యలను తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మాజీ మంత్రుల దగ్గర నుండి ముఖ్యమంత్రుల వరకు పాలన ఎలా చేయాలో ..ప్రజల సమస్యలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎలా తీర్చాలో నేర్చుకోమని చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ .

సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్ మహానగరంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర హోం గార్డు కుటుంబాలతో సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి హోం గార్డులపై వరాల జల్లు కురిపించారు .గతంలో మూడు వేల రూపాయలతో చాలి చాలని జీతాలతో బ్రతుకు బండిని లాగిస్తున్న హోం గార్డులకు పన్నెండు వేల రూపాయలకు పెంచారు కేసీఆర్ .తాజాగా దాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచేశారు .అంతే కాకుండా ఇక నుండి ప్రతి ఏడాది వెయ్యి రూపాయల చొప్పున జీతం పెంచుతామని కూడా హామీ ఇచ్చారు .

ఒకప్పుడు డ్యూటీ ల్లో ఎక్కాలన్న ..డ్యూటీ ముగించుకొని ఇంటికి పోవాలన్నా బైక్ లను లిఫ్ట్ అడిగేవాళ్ళు .లేదా ఎవర్నైన రిక్వెస్ట్ చేస్తూ గమ్యాన్ని చేరుకునేవారు .ఇలాంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కోకూడదు అని నగరాల్లో ,పట్టణాలలో ఉద్యోగం చేసే హోం గార్డులకు బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు .ఇక కాలుష్య వాతావరణంలో ,ఎండా అనక వాన అనక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉద్యోగం చేసేవాళ్ళు .అలా చేయడం వలన తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు .

ఇలా అనారోగ్యానికి గురికావడం వలన సరైన సదుపాయం లేక ..ఆస్పత్రులకు పోయే స్థోమత లేక అలానే టాబ్లెట్స్ తో సరిపుచ్చుకుంటూ బ్రతుకుబండిని కొనసాగించేవారు .కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రాపిక్ పోలీసుల కోసం ,హోం గార్డుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించారు .తాజాగా ముఖ్యమంత్రి హోం గార్డులకు సాధారణ పోలీసుల మాదిరిగా ఆస్పత్రులలో చూయించుకోవచ్చు తెలిపారు .అంతే కాకుండా వారితో పాటుగా అలవెన్సులు కూడా కల్పిస్తామని తెలిపారు .

కుటుంబ సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్సు..మహిళా హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవులు ..ట్రాఫిక్ విభాగంలోని హోంగార్డులకు ఇతర పోలీసుల మాదిరిగా30% అదనపు వేతనం..కానిస్టేబుళ్ల మాదిరిగా ప్రతీ ఏడాది నాలుగు యూనిఫామ్స్ ..కానిస్టేబుళ్ల నియామకాల్లో 25% రిజర్వేషన్ ..రిజర్వ్‌డ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో 15% రిజర్వేషన్డ్రైవర్ల నియామకాల్లో కూడా 20 %రిజర్వేషన్ ..కమ్యూనికేషన్ విభాగంలో 10 % రిజర్వేషన్ లను కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు .గతంలో ఎన్నడు ఎవరు తీసుకోలేని నిర్ణయాలను తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు ..