Home / ANDHRAPRADESH / ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్‌ ఇదే…!

ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్‌ ఇదే…!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

ఇదే మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించి వైఎస్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat