Home / MOVIES / ప‌వ‌న్ సినిమా టీజ‌ర్ నేడే.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేనా..?

ప‌వ‌న్ సినిమా టీజ‌ర్ నేడే.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్‌ విడుదలకు టైమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అజ్ఞాతవాసి టీజర్‌ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఇక అజ్ఞాతవాసి టీజర్‌ కోసం అటు మెగా అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు సైతం వెయిటింగ్ ఫర్ అజ్ఞాతవాసి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా పవన్ భక్తుడు నితిన్.. అజ్ఞాతవాసి టీజర్ కోసం ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేయగా.. కీర్తి సురేష్, అనుఇమ్మాన్యుయేల్‌ టీజర్ కోసం వెయిటింగ్ అంటూ తాజా పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక విడుదలకు ముందే అజ్ఞాతవాసి ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో శ‌నివారం సాయంత్రం విడుదలయ్యే టీజర్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని మెగా ప‌వ‌ర్ ఫ్యాన్స్ ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat