Home / SLIDER / జ‌డేజా న‌యా రికార్డ్‌ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!

జ‌డేజా న‌యా రికార్డ్‌ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్‌ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం పది సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన జడ్డూ.. 69 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ నీలమ్‌ వంజా బౌలింగ్ చెలరేగిపోయిన జడేజా.. వరుసగా ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.

జడేజా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో జామ్‌నగర్‌ 20 ఓవర్లలో 239/6 పరుగులు సాధించింది. అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ భారత ఆటగాళ్లలో రవిశాస్త్రి, యువరాజ్ మాత్రమే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా.. యువీ ఇంగ్లాండ్‌ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. 1985 రంజీ సీజన్లో ముంబై తరఫున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడాపై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat