Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ అతి పెద్ద మాస్ట‌ర్ స్కెచ్.. రేసులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్..?

జ‌గ‌న్ అతి పెద్ద మాస్ట‌ర్ స్కెచ్.. రేసులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్..?

రాజ‌నీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శ‌త్రువులుగా మారిపోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగ‌నున్నాయ‌నే వార్త ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేటలో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే అక్కడ బలంగా ఉన్న మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావును దెబ్బ‌తీయ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఓడించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఓ అద్భుత‌మైన ఐడియా వేశారని స‌మాచారం. సాదాసీదా నేత‌ల‌ను అక్క‌డి నుంచి నిల‌బెడితే.. ప‌ని జ‌ర‌గ‌ద‌ని తెలుసుకుని జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ‌ నార్నే శ్రీనివాస‌రావును అక్క‌డి నుంచి బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇలా అయితేనే చిల‌క‌లూరి పేట వైసీపీ ఖాతా లో ప‌డ‌డం, బాబుకు దెబ్బ‌త‌గ‌ల‌డం రెండూ జ‌రుగుతాయ‌ని జ‌గ‌న్ అందుకోసం ప‌క్కాగా ప్లాన్ చేశార‌ని స‌మాచారం. దీంతో ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2004లో కేవ‌లం 212 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయ‌న 2009లో 19 వేల మెజార్టీతో గెలిచారు. 2014లోనూ ఆయన 10,684 ఓట్ల తేడాతో గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా నియోజకవర్గంలో మరో నాయకుడు ఎదగకుండా చక్రం తిప్పుతూ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చారు. దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపొందాలంటే ఆషామాషీ కాదని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మంత్రి పుల్లారావును ఓడించాలంటే నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ వ‌ల్ల‌కాద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొత్త అభ్యర్థిని వెతికి పోటీకీ దింపితే బాగుంటుందని జగన్‌ ఆలోచిస్తున్నారట. దీనిలో భాగంగా సినీనటుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావును రంగంలోకి దించాలని జగన్‌ భావిస్తున్నారట. ఆయన పోటీపై ఇప్పటికే ప్రాధమికంగా చర్చించారట. దీనికి నార్నే కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. వాస్త‌వానికి గత ఎన్నికల సమయంలోనే ఆయన గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదన పక్కకు పోయింది. ఇక‌, ఇప్పుడు జగన్‌కు నార్నేపై దృష్టి ప‌డింది. నార్నే రంగంలోకి దిగితే చిలకలూరిపేట రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయ‌ని, వైసీపీ జెండా ఎగురుతోంద‌ని భావిస్తున్నార‌ట‌. నార్నే రంగంలోకి దిగితే… ఆయన అల్లుడు ఎన్టీఆర్ ఇంట‌ర్న‌ల్ స‌పోర్ట్ కూడా ఉండ‌నే ఉంటుంద‌ని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ.. చిల‌క‌లూరి పేట రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat