Home / ANDHRAPRADESH / 2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసిన సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగ్గయ్యపేట నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్  అలియాస్ తాతయ్య కు రానున్న ఎన్నికల్లో సీటు దక్కదు అని రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల టాక్ .గత నాలుగు ఏండ్లుగా నియోజక వర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే అనుచరవర్గం ,అతని సోదరుడు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలు .ఇప్పటివరకు ఇచ్చిన ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .ఇదే విషయం గురించి జిల్లా ముఖ్యంగా నియోజక వర్గ తెలుగు తమ్ముళ్ళు కూడా బాహాటంగా అనుకుంటున్నారు .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గ నేతలు రానున్న ఎన్నికల్లో తమ వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకువస్తున్నారు .మొదటి నుండి కుల రాజకీయాలను ప్రోత్సహించే బాబు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికే సీటు ఇస్తాను అని హామీ ఇచ్చారు అని కూడా నియోజక వర్గ టీడీపీ నేతలు అంటున్నారు .

అయితే నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ మొత్తం మూడు గ్రూపులుగా చెలామణి అవుతుండటంతో కూడా పార్టీ క్యాడర్ లో ఆందోళన నెలకొన్నది .అంతే కాకుండా ఈ గ్రూపుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికీ వారే యమునా తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు .అందులో ఎమ్మెల్యే శ్రీ‌రాంతాత‌య్య ,ఎమ్మెల్సీ జ‌నార్ధ‌న్ ,మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాం విడిపోయిన నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు, ఎవ‌రిద‌గ్గ‌ర‌కు వెళితే ఏం జ‌రుగుతుందో ఏం ఉప‌ద్ర‌వం వ‌స్తుందో అని భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత శాస‌న‌స‌భ స‌భ్యుడు శ్రీ‌రాం తాత‌య్య త‌న స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలో ప్ర‌తి గ్రామంలో గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌డం తెలుగుదేశం సీనియ‌ర్ నాయ‌కుల‌కు మింగుడుప‌డ‌ని విష‌యం. ఈ వ్య‌తిరేకుల‌కు ప్ర‌ధాన కార‌ణం శ్రీ‌రాం సోదరులు వ్య‌వ‌హార శైలి. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు, క‌క్ష సాధింపు చ‌ర్య‌లు త‌ప్పుడు కేసులు అని తెలుగు తమ్ముళ్ళనోట వినిపిస్తున్న మాట‌.

  

ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రాం సోదరులు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి అభివృద్ధి కార్య‌క్ర‌మానికి కాంట్రాక్ట‌ర్లను ఆర్థిక ప‌ర్సంటేజీలు నిర్ణ‌యించ‌డం అక్ర‌మంగా ఇసుక‌ను తెలంగాణ రాష్ట్రానికి ర‌లించ‌డం ద్వారా కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్ట‌డం ద్వారా ఇసుక కుంభ‌కోణంలో ఇరుక్కోవ‌డం, నీరు – మ‌ట్టి కార్య‌క్ర‌మంలో, చెరువు మ‌ట్టి పూడిక తీత ప‌నుల‌లో ల‌క్ష‌లు, బియ్యం, గుట్కాల వంటి అక్ర‌మ ర‌వాణాల‌ను ప్రోత్స‌హించ‌డం పేకాట శిభిరాల నిర్వ‌హ‌ణ‌కు అనైతిక మ‌ద్ద‌తు ఇవ్వ‌డం డ‌బ్బు సంపాదనే ప్ర‌ధాన ధ్యేయంగా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పార్టీ అభివృద్ధికి పాటుప‌డ‌టం లేద‌నేది, పైన తెలిపిన వ్య‌తిరేక‌త‌ల‌త‌కు కార‌ణాలుగా చెప్తున్నారు. తాత‌య్య నైతం మేడి పండును పోలీ ఉంటుంది అని చెప్పేవి శ్రీ‌రంగ‌నీతుల‌ని, తాను శాంతి వ్యాఖ్య‌లు చేసేదిఆ అనైతిక అక్ర‌మ కార్య‌క్ర‌మాలేనని, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న మాట అని అందరు అంటున్నారు ‌.!

 

2005లో శ్రీ‌రాం తాత‌య్య కాంగ్రెస్ పార్టీ త‌రుపున మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌గా అప్ప‌టి ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య‌భాను గారి ఆశీస్సుల‌తో విజ‌యం సాధించి. అన‌తి కాలంలోనే అధికారాన్ని అడ్డుపెట్టుకొని స్పాంజ్ ఐర‌న్ ప్లాంటు ద్వారా ఐర‌న్ అక్ర‌మ త‌వ్వ‌కాల ద్వారా కోట్లు సంపాదించిన విష‌యం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలుసు. 2009 అసెంబ్లీ ఎన‌నిక‌ల్లో ఎన్నిక‌లు కేవ‌లం 15 రోజులు ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి త‌న‌కు రాజ‌కీ భిక్ష పెట్టిన ఉద‌య‌భానుకి వెన్నుపోటు పొడిచి దేశం పార్టీ త‌రుపున ఎమ్మెల్యేగా పోటీచేయ‌డం కొద్ది రోజుల్లోనే అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఒక భ‌యంక‌ర‌మైన హ‌త్య న‌వాబుపేట‌కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మాజీ స‌ర్పంచ్‌, ఉద‌య‌భానుకు కుడి భుజ‌నంగా ఉన్న గింజుప‌ల్లి వీర‌య్య‌ను కార్తీక సోమ‌వారం శివాయంలో పూజ‌లో పాల్గొన్న స‌మ‌యంలో అత్యంత కిరాత‌కంగా, పాశ‌వికంగా క‌త్తుల‌తో, గొడ్డ‌ళ్ల‌తో, వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపిన కేసులో పోలీసుల విచార‌ణ‌లో శ్రీ‌రాం ధ‌నుంజ‌య్య (చిన్న‌బాబు) కుట్ర‌దారుడు అని వారి సెల్ ఫోన్ సంభాష‌ణ‌లు, ఎస్ఎల్‌టీ మిల్లు వ‌ద్ద హంత‌కుల స‌మావేశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి అని వార్తలు కూడా వచ్చాయి . ప్ర‌స్తుతం ఈ హ‌త్య చేసిన ముద్దాయిల‌ను త‌న వెంట తిప్పుకోవ‌డం వారి ద్వారా నియోజ‌క‌వ‌ర్గవ‌ర్గంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను భంగం చేయ‌డం అల్ల‌ర్లు సృష్టించ‌డం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కంద‌రికి తెలిసిందే అని అందరు గుస గుసగుస లాడుకుంటున్నారు .

 

అయితే నూత‌నంగా ఏర్ప‌డిన రాజ‌ధాని అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకొని తాత‌య్య సోద‌రుడు శ్రీ‌రాం సాయి పెద్ద ఎత్తున అక్ర‌మ మెట‌ల్ వ్యాపారం, బినామీ కాంట్రాక్ట‌రుఆ ఉంటూ (అవుట్ సోర్సింగ్‌లో) ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని, పెండింగ్ ఫైల్స్ క్లియ‌ర్ చేయిస్తామ‌ని మోసం చేస్తూ ల‌క్ష‌లు దండుకోవ‌డం దేశం పార్టీలోని ఒక వ‌ర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మ‌కిలి పార్టీకి అంటుతుండ‌నే భ‌యాందోళ‌న‌లో ఉంది అని కూడా తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు . సోదాడు ధ‌నుంజ‌య నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే షాడోగా ఉంటూ ప్రైవేట్ సిమెంట్స్‌, రియ‌ల్ ఎస్టేట్‌దందా, పోలీసు వారిని అడ్డుపెట్టుకొని ప్ర‌త్య‌ర్థి పార్టీ వారిపై సొంత వారిని అదుపులో ఉంచుకోవ‌డం కోసం త‌ప్పుడు కేసులు పెట్ట‌డం. ప్ర‌లోభ పెట్ట‌డం బెదిరించ‌డం త‌మ దారిలోకి వ‌చ్చిన త‌రువాత రాజీలు చేయ‌డం ఇత‌నికి వెన్న‌తోపెట్టిన విద్య‌ అని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు అని లోకుల మాట .

 

 

అయితే ఎమ్మెల్యే శ్రీ‌రాం సోదరుల వ్య‌వ‌హార‌శైలిప‌ట్ల దేశం పార్టీలోని ఒక వ‌ర్గం వారికి తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది అని కూడా ప్రధాన సామాజిక వర్గం బాబుకు పిర్యాదు చేశారు అని టాక్ . ఈ విష‌యాల‌పై ఆయా నేత‌లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ల‌గా.. అధిష్టానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి స‌ద‌రు శ్రీ‌రాం తాత‌య్య మ‌రియు సోద‌రుల‌ను ఈ విష‌యాల‌పై గ‌ట్టిగా నిల‌దీసి మీ ప‌ద్ధతులు మార్చుకోవాలి..వచ్చే ఎన్నికల్లో నీకు సీటు అనుమానమే అని హెచ్చ‌రించిన‌ట్లు కూడా స‌మాచారం.ఒకవైపు తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌లు గ్రూపు త‌గాదాల నేప‌థ్యంలో దేశం పార్టీకి నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కత్వం ఎలా చేయాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉండ‌గా.. మరోవైపు తనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నవ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు సీటు కేటాయిస్తారా..? లేదా…? అనే సందిగ్ధంలో ప‌డిపోయి రాజ‌కీయ వైరాగ్య స్థితిలో శ్రీ‌రాం తాత‌య్య ఉన్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat