ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..! – Dharuvu
Home / SLIDER / ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..!

ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..!

భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే ఫీచర్ ఫేస్‌బుక్ యూజర్లకు లభ్యం కానుంది. దీని ఒక ఫేస్‌బుక్ యూజర్ ఫొటోలను మరొకరు అభ్యంతరకరంగా వాడలేరు. వాడినా అవతలి యూజర్‌కు తెలిసిపోతుంది.ఫేస్‌బుక్ కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. ఈ క్రమంలో ఎవరైనా ఒక యూజర్‌కు చెందిన ఫొటోను మరో వ్యక్తి (ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ అయినా, కాకున్నా) ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి పోస్ట్ చేస్తే ఆ ఫొటోలో ఉన్న యూజర్‌కు ఫేస్‌బుక్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. దీంతో ఆ ఫొటోను చూసి యూజర్ దాని గురించి ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఆ ఫొటోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాను ఫేస్‌బుక్ బ్లాక్ చేస్తుంది. ఫేస్‌బుక్‌లో రానున్న ఈ ఫీచర్ వల్ల అందులో ఒక యూజర్‌కు చెందిన ఫొటోలను మరొక యూజర్ వాడలేరు. అలాగే వాటిని ప్రొఫైల్ పిక్‌లుగా కూడా పెట్టుకోలేరు.