రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు.. – Dharuvu
Home / EDITORIAL / రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు..

రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు..

‘బీ కేర్ ఫుల్.. రేపు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు.. ఏ పనీ మొదలుపెట్టవద్దు’.. అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్యులు. డిసెంబరు 21న ఏ పని మొదలుపెట్టినా మటాషేనని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభాసుపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.డిసెంబరు 21న పగటి కాలం నిడివి చాలా తక్కువ. ప్రతీ ఏడాది ఇది జరిగేదే అయినా ఈసారి మాత్రం సూర్యుడు, శని ఒకే రాశిలోకి వస్తున్నారని చెబుతున్నారు. ఇలా రావడం 350 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని, ప్రళయానికి ఇది సంకేతమని చెబుతున్నారు.1664 తర్వాత ఖగోళంలో ఇలాంటి మార్పు కనిపించడం ఇదే తొలిసారని నీల్ స్పెన్సర్ అనే జ్యోతిష్యుడు తెలిపాడు. సాధారణంగా వ్యక్తుల జాతకంలో శని మకర రాశిలోకి ప్రవేశిస్తే బాగానే ఉంటుందని, కానీ ఖగోళ పరంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయమని పేర్కొన్నాడు. కాబట్టి గురువారం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ పనీ మొదలుపెట్టద్దని, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు.