ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్…! – Dharuvu
Home / BUSINESS / ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్…!

ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్…!

నా జీవితంలో నేను చేసిన మంచి పని కండోమ్స్ సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించడం. నేను ప్రచారం చేసే కండోమ్స్ కంటే గొప్పగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయా అని సవాల్ విసురుతున్నారు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ . అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న రాందేవ్ బాబా కూడా కండోమ్స్ ఉత్పత్తుల రంగంలోకి రావాలి. ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్ తీసుకురావాలి అని రాఖీ సావంత్ సూచించారు. బిపాసాబసు, సన్నీలియోన్ కండోమ్ యాడ్స్‌లో నటిస్తే ప్రభుత్వం సెన్సార్ విధించదు. రాఖీ సావంత్ కండోమ్స్ యాడ్‌లో నటిస్తే మాత్రం ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. వాటి ప్రకటనలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య రాకుండా నిషేధం విధిస్తుంది. వాళ్లు కండోమ్స్ యాడ్స్ చూడకుండా బ్యాన్ విధించడం సమంజసమా అని రాఖీ సావంత్ నిలదీసింది.

దేశంలోని అందరికీ ఎయిడ్స్ ఒకవేళ నేను ప్రచారం చేసే కండోమ్స్ ప్రకటన చూడకుంటే దేశంలో అందరికీ ఎయిడ్స్ వస్తుంది. రాత్రిపూట యాడ్స్ ప్రసారం చేస్తే పిల్లలకు కండోమ్స్ గురించి పిల్లలకు తెలియదు. భారతీయులందరికీ ఎయిడ్స్ తెప్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. పిల్లలు చూడకపోతే సెక్స్ గురించి ముందస్తు జాగ్రత్తలు ఎలా తెలుస్తాయి అని రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది.