చరిత్ర సృష్టించిన కుక్ .. – Dharuvu
Home / SLIDER / చరిత్ర సృష్టించిన కుక్ ..

చరిత్ర సృష్టించిన కుక్ ..

యాషెస్ సిరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ మరోసారి డబుల్ సెంచురీతో తన సత్తా చాటాడు .యాషెస్ సిరిస్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కుక్ తన కెరీర్ లో ఐదో డబుల్ సెంచురీ సాధించాడు .మొత్తం మూడు వందల అరవై ఒక్క బంతుల్లో ఇరవై మూడు ఫోర్లతో కుక్ డబుల్ సెంచురీ మార్కును చేరాడు .

అయితే మొదట 104 పరుగులతో ఆటను ప్రారంభించిన కుక్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు .అయితే ఒకవైపు తమ జట్టు ఆటగాళ్ళు వరసగా ఔట్ అవుతున్న కానీ కుక్ మాత్రం ఏకాగ్రతను కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ కొనసాగించాడు .ఫోర్ కొట్టి కుక్ డబుల్ సాధించాడు .దీంతో ఈ ఫీట్ ను సాధించిన వారి జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ ,ద్రావిడ్ ల సరసన నిలిచాడు .