ఆకాశాన్ని అంటిన పసిడి ధర .. – Dharuvu
Home / BUSINESS / ఆకాశాన్ని అంటిన పసిడి ధర ..

ఆకాశాన్ని అంటిన పసిడి ధర ..

ఇంటర్నేషనల్ మార్కెట్ల ఎఫెక్ట్ తో దాదాపు మూడు వారాల పాటు గరిష్టానికి చేరుకున్న పసిడి ధర ఈ రోజు మరింత పెరిగింది .దీంతో గురువారం వరకు మార్కెట్లో రూ .175 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర ముప్పై వేల రెండు వందల యాబై రూపాయలుగా ఉంది .బంగారం ధర పెరగడం వరసగా ఇదో ఐదో రోజు.

స్థానిక ఆభరణాల తయారిదారుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడంతో ధర పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి .అంతే కాకుండా పారిశ్రామిక వర్గాలు ,నాణేల తయారిదారుల నుండి కొనుగోళ్ళు పెరగడంతో వెండి ధర కూడా పెరిగింది .మొత్తం రెండు వందల యాబై రూపాయలు పెరగడంతో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుకు చేరింది ..