టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్‌ అక్తర్‌… – Dharuvu
Home / SLIDER / టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్‌ అక్తర్‌…

టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్‌ అక్తర్‌…

ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు అంట .

ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో అక్తర్ మాట్లాడుతూ హీరోయిన్ సోనాలి బింద్రే అంటే తనకు చాలా ఇష్టం .ఎంతగా ఇష్టం అంటే తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకునే అంతగా ఆమెపై ప్రేమను పెంచుకున్నాను .ఇదే విషయం గురించి సోనాలితో మాట్లాడేందుకు తమ టీం మేనేజ్మెంట్ తో మాట్లాడాను .వాళ్ళు సరే అన్నారు .

దీంతో ఆమెను కలిసి తనపై నాకున్న ప్రేమను చెప్పాలి అని అనుకున్నాను .అంతే కాదు ప్రేమను ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేసి అయిన సరే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను .అయితే చివరికి ఆమెను కలవలేదు .నా ప్రేమ విషయం చెప్పే అవకాశం రాలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు .