సైనాపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ .. – Dharuvu
Home / SLIDER / సైనాపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ ..

సైనాపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ ..

పీవీ సింధు ,సైనా నెహ్వాల్ ఇద్దరూ ప్రపంచంలోనే అసమాన ప్రతిభ ఉన్న షట్లర్లు.వీరిద్దరూ గోపీచంద్ శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ పై తమదైన ముద్ర వేసిన హైదరాబాదీ క్రీడాకారిణులు.అయితే గతంలో వారు తలపడిన సమయంలో ఆటలో సీరియస్ నెస్ మినహా అసలు మిత్రుత్వం లేదనే చాలా మంది అనుకున్నారు .

వారిద్దరూ కూడా అలాగే ఉండేవారు కూడా .ఆటలో తలపడిన సమయంలో మినహా ఎక్కడ కూడా వారిద్దరూ ఒకచోట ప్రత్యక్షమవ్వరు .ఈ తరుణంలో సైనా గురించి పీవీ షాకింగ్ కామెంట్స్ చేసింది .ఈ విషయం మీద పీవీ సింధు స్పందిస్తూ సైనాకు తనకు స్నేహా బంధం ఉంది .కానీ దానికి షరతులు వర్తిస్తాయి.

ఇద్దరం కల్సే ప్రాక్టిస్ చేస్తున్న కానీ ఇద్దరం మాట్లాడుకునే తీరిక కానీ సమయం కానీ లేదు.మేము ఇద్దరం స్నేహితులం కానీ అది కేవలం హాయ్ బై అని చెప్పుకునే అంతగా మాత్రమే ..ఇద్దరం కూర్చొని గంటల తరపడి మాట్లాడుకునే అంత స్నేహం మా ఇద్దరి మధ్య లేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ..