నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది .. – Dharuvu
Home / SLIDER / నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది ..

నిన్న కుంబ్లే ..నేడు జహీర్ ..టీంఇండియా లో ఏమి జరుగుతుంది ..

ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ ..టీంఇండియా మాజీ కెప్టెన్ ..మాజీ కోచ్ లెజండరీ ఆటగాడు అయిన అనిల్ కుంబ్లేను అవమానకర పరిస్థితుల్లో కోచ్ పదవీ నుండి తప్పించిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం మీద ఇటు క్రీడ వర్గాల్లో ..క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా పెను దుమారాన్నే లేపింది.

ఈ తరుణంలో తాజాగా మరో సీనియర్ ఆటగాడు ..టీంఇండియా ఫాస్ట్ బౌలర్ సీనియర్ ఆటగాడు అయిన జహీర్ ఖాన్ కు అవమానం జరిగింది వార్తలు వస్తున్నాయి .గతంలో కుంబ్లేను కోచ్ పదవీ నుండి తప్పించిన తర్వాత రవిశాస్త్రిను కోచ్ గా ..జహీర్ ఖాన్ ను ఫాస్ట్ బౌలింగ్ సలహాదారుడుగా ..టీంఇండియా మాజీ కెప్టెన్ సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ను విదేశాల్లలో బ్యాటింగ్ సలహాదారుడుగా నియమిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అయితే ప్రస్తుతం టీంఇండియా దక్షిణాఫ్రికా దేశంలో పర్యటిస్తుంది .ఇప్పటికే టీంఇండియా అక్కడకు చేరుకుంది.కానీ బౌలింగ్ సలహాదారుడుగా ఉన్న జహీర్ మాత్రం వెళ్ళలేదు .అయితే పొమ్మనలేక పోగబెడుతూ జహీర్ ను అక్కడకు పంపించలేదు అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే విషయం గురించి బీసీసీఐ ప్రముఖ అధికారి కూడా తెలియదనడం విశేషం ..