Home / MOVIES / హీరో సూర్య‌పై.. ప‌వ‌న్ ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం..!!

హీరో సూర్య‌పై.. ప‌వ‌న్ ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం..!!

త‌మిళ హీరో సూర్య ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌రంలో సూర్య తాజాగా న‌టించిన చిత్రం (‘తాన సెర్న్ద్ర కూటం’) గ్యాంగ్ (తెలుగు) ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాగా, విగ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు యువీ క్రియేష‌న్స్ సంస్థ విడుద‌ల చేయ‌నుంది.
ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

అయితే. భాగ్య‌న‌గ‌రంలో జ‌రిగిన గ్యాంగ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌లో హీరో సూర్య మాట్లాడుతూ… తెలుగు హీరోల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సూర్య అభిమానులు తెలుగులో మాట్లాడాలంటూ.. ఒత్తిడి తేవ‌డంతో.. తెలుగులో మాట్లాడిన సూర్య‌.. ప‌వ‌న్ చిత్రానికి మ్యూజిక్ అందించిన అనిరుద్దీన్ త‌న చిత్రానికీ మ్యూజిక్ అందించాడ‌ని తెలిపాడు. ఇలా సూర్య మాట్లాడుతున్న క్ర‌మంలో ప‌వ‌న్ చిత్రం అజ్ఞాన‌వాసి అని చెప్ప‌డంతో.. ఆ మాట సూర్య‌కు విన‌ప‌డిందో.. లేదో.. అజ్ఞాన‌వాసి అంటూ సూర్య ప‌లికాడు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అంతేగాక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు సూర్య‌పై తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat