లాలూకు మూడున్నరేళ్లు జైలు..! – Dharuvu
Home / NATIONAL / లాలూకు మూడున్నరేళ్లు జైలు..!

లాలూకు మూడున్నరేళ్లు జైలు..!

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ కోర్ట్ మూడున్నరేళ్ల జైలుశిక్ష వేసింది. దాంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. దాణా కుంభకోణం కేసులో సీబీఐ రాంచీ కోర్ట్ లాలూతో పాటు ఫూల్ చంద్, మహేష్ ప్రసాద్, బేక్ జులియస్, సునీల్ కుమార్, సుశీల్ కుమార్, సుధీర్ కుమార్, రాజారాం లకు ఇదే శిక్ష విధించింది. సీబీఐ కోర్ట్ న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షలను వెల్లడించారు.లాలూ సహా నిందితులంతా రాంచీ కోర్టుకు హాజరై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పుని విన్నారు.