Home / Uncategorized / తెలంగాణలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నాం..క‌డియం

తెలంగాణలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నాం..క‌డియం

తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సికింద్రాబాద్, సెయింట్ పాట్రిక్ స్కూల్ లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2018 ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు. సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించడానికి, సైన్స్ ఫెయిర్లు నిర్వహించడానికి నిధులు ఎక్కువగా కేటాయించాలని కోరారు.

శాస్త్ర విజ్ణానాన్ని పెంపొందించకుండా దేశం ముందంజ వేయలేదని, ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి రాలేమని ఉప ముఖ్య‌మంత్రి క‌డియం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడ 296 గురుకులాలు ఉంటే…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలో 544 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వీటితో పాటు 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 8 లక్షల మందికి నాణ్యమైన విద్య అందుతోందన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని గురుకులాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల మంది విద్యార్థులుండగా…28 లక్షల మంది ప్రభుత్వ విద్యాలయాల్లో, 30 లక్షల మంది ప్రైవేట్ విద్యాలయాల్లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సగటు ప్రతి లక్ష మందికి 59 విద్యాలయాలు అందుబాటులో ఉండగా, దేశ సగటు ప్రతి లక్ష మందికి 29 విద్యాలయాలే అందుబాటులో ఉన్నాయన్నారు. మొత్తానికి ప్రస్తుతం దేశంలో అత్యంత నాణ్యమైన విద్య తెలంగాణలో అందుతుందన్నారు.

        విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి  పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా…గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్ మ్యాన్ గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మనందరికీ స్పూర్తిదాయకమన్నారు. విద్యార్థులు కూడా అబ్దుల్ కలాం మాదిరిగా కష్టపడి ఉన్నత స్థాయికి రావాలని పిలుపునిచ్చారు.

దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి ఈ సైన్స్ ఫెయిర్ కు వచ్చిన విద్యార్థులు చారిత్రక హైదరాబాద్ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు చూడాలని, ఇందుకోసం విద్యాశాఖ తరపున టూర్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలో అత్యంత పిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ అయితే ఎంతో ఘన చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని, ఇక్కడ అనేక పరిశోధనా కేంద్రాలు, ఖ్యాతిగాంచిన విద్యాలయాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, జీడీపీలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో, ఐటి ఎగుమతులు, సంక్షేమ పథకాల అమలులో ప్రథమ స్థానంలో ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ఐదు రోజులు సైన్స్ ఫెయిర్ లో తమ ప్రతిభను చాటాలని, హైదరాబాద్ నగరాన్ని ఆస్వాదించాలని అన్నారు. సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థినులను మెమెంటోలతో సత్కరించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగశాలలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat