లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!! – Dharuvu
Home / CRIME / లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!!

లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!!

లోప‌ల బాయ్ ఫ్రెండ్‌.. బ‌య‌ట తండ్రి.. ఇంత‌లోనే షాక్..:!! ఏంట‌నుకుంటున్నారా..? కొంద‌రు పిల్ల‌లు త‌ల్లిదండ్రుల మాట‌ల‌ను చెవిన‌పెట్ట‌డం లేదు. ఈ విష‌యంలో పిల్ల‌ల‌ది ఎంత త‌ప్పు ఉందో.. త‌ల్లిదండ్రుల‌దీ అంతే త‌ప్పు ఉందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీని వ‌ల్ల విలువైన ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. కాగా, మాన‌వ సంబంధాల‌ను మంట క‌లిపే ఇటువంటి సంఘ‌ట‌న ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది.

కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తులో నివాసం ఉంటోంది విశ్వ‌నాథ్ సాహో కుటుంబం. అయితే, విశ్వ‌నాథ్ కూతురు పూజ స్కూల్ త‌ర‌గ‌తుల్లో కూడా ఉత్తీర్ణ‌త సాధించ‌క‌పోవ‌డంతో ఇంట్లోనే ఉంటూ త‌ల్లిదండ్రుల ప‌నుల్లో సాయ‌ప‌డుతూ ఉండేది. ఇదే క్ర‌మంలో మ‌రో అపార్ట్ మెంట్‌లో ఉంటున్న ధ‌ర్మేంద్ర అనే వ్య‌క్తి, పూజ‌కు మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. ఎంత‌లా అంటే.. పూజ త‌న బెడ్‌రూమ్‌కు ధ‌ర్మేంద్ర‌ను పిలిచేంత‌లా అన్న‌మాట‌.

ఈ క్ర‌మంలోనే… ఓ రోజు ఉద‌యం పూజ ఉంటున్న గ‌దిలో నుంచి పెద్ద పెద్ద శ‌బ్దాలు రావ‌డంతో కంగారుప‌డ్డ తండ్రి విశ్వ‌నాథ్ పూజ గ‌ది త‌లుపులు త‌ట్టాడు. ఎంత‌కీ త‌లుపులు తీయ‌క‌పోవ‌డంతో కంగారుప‌డ్డ విశ్వ‌నాథ్ చివ‌రికి త‌లుపుల‌ను పగుల‌గొట్టాడు. అప్ప‌టి వ‌ర‌కు సీక్రెట్‌గా ఉన్న పూజ ప్రేమాయ‌ణం కాస్తా బ‌ట్ట‌బ‌య‌లు అయింది. ఈ ఉదాంతాన్ని చూసిన విశ్వ‌నాథ్ ధ‌ర్మేంద్ర‌పై చేయి చేసుకున్నాడు. ఇలా ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకోవ‌డంతో ప్ర‌మాద‌వ‌శాత్తు విశ్వ‌నాథ్ మూడో అంత‌స్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప‌డిపోయాడు. ఇలా విశ్వ‌నాథ్ మృతి చెందాడు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తులో భాగంగా పూజ, ధ‌ర్మేంద్ర‌ను అరెస్టు చేశారు.

ఇక్క‌డ మ‌రో విశేష‌మేమిటంటే.. క‌న్న తండ్రి త‌న ప్రియుడు చేతిలో చ‌నిపోయినా కూడా.. పూజలో మాత్రం ఎటువంటి భ‌యం లేక‌పోవడం ఒక వంతైతే.. ఎవ‌రైనా ఎప్ప‌టికైనా చ‌నిపోవాల్సిందేగా అంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.