Home / SLIDER / విప‌క్షాల‌ను పిచ్చికుక్క‌లు క‌రిచాయి-మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

విప‌క్షాల‌ను పిచ్చికుక్క‌లు క‌రిచాయి-మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ సంక్షేమ మంత్రి జగదీశ్‌ రెడ్డి విప‌క్షాల‌పై ఫైర్ అయ్యారు. విపక్షాలను పిచ్చి కుక్కలు కరిచాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమా భరత్ కుమార్‌ ఘన సన్మానం జ‌రిగింది. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధ‌ర్, అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, లోకసభ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్, స్థానిక శాసనసబ్యులు గాదరి కిషోర్ కుమార్‌లు హాజ‌ర‌య్యారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు సిద్దం కావాల‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్ విసిరారు. అసెంబ్లీ అనగానే పారిపోయిన ప్రతిపక్షం ఇప్పడు రోడ్లెక్కి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. నిన్నటి దాకా ఒక జెండా…ఇప్పుడోక జెండా నెత్తుకున్నా నేత సర్కస్‌లో జోకర్ అని వ్యాఖ్యానించారు. `అవినీతిని నెత్తిన ఎత్తుకున్న విపక్ష కాంగ్రేస్ పార్టీ నేతలు జైళ్ళ పాలయ్యారు.

మీరు మోసిన ముఖ్యమంత్రి పాలనలోనే మీ నేతలు, అధీకారులు జైళ్ళకు వరుస కట్టారు. బియ్యం వడ్ల నుండి వస్తాయన్న విషయం తెలువని నేతలు విమర్శలకు దిగితున్నారు. వడ్లు కింద పండుతాయో…పైన పండుతాయే తెలువని సన్నాసులు వ్యవసాయంగురించి…ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వు కుంటున్నారు`అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఒప్పందాలతో వాడని కరెంట్ కు కుడా బిల్లులు చెల్లించారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కంపెనీలకు పైసలు కట్టాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ నేత‌లు చేసిన పాపాల‌కే అని అన్నారు. `60 ఏండ్లుగా తెలంగాణను నాశనము చేసిన నేతలు రెండు రోజులుగా సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు.

సంవత్సర కాలంగా విద్యుత్‌ను కొనుగోలు చెయ్యలేదు. విద్యుత్ గురించి మాట్లడేటప్పుడు ముందు విద్యుత్ వైర్లు పట్టుకుని చూడండి…విద్యుత్ ఉందా లేదా తెలుస్తుంది. 6000 వేల మేఘావాట్ల విద్యుత్ ను ఇచ్చిపోతే ముఖ్యమంత్రి కెసియార్ దానిని 14,000 వేల మేఘావాట్లకు పెంచింది నిజం కాదా? 12,500 కోట్లతో సబ్ స్టేషన్ లు ట్రాన్స్ మిషన్ తో ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడుస్తుంది. ఇప్పటికే వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాం. త్వరలోనే కోటీ ఎకరాలకు నీరందిస్తాం. ఈ ఖరీఫ్ నుండి రైతాంగానికి ఎకరాకు 4,000 రూపాయల పెట్టుబడిని అందించబోతున్నాం. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ పైన నిజం చెప్పి ఓట్లు అడిగిన మొనగాడు ముఖ్యమంత్రి కేసీఆర్. మీరే ఇచ్చిపోతే ఎన్నికల సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు ఎందుకో చెప్పుకోలేక పోయారు` అని వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat