ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేసిన వర్మ .. – Dharuvu
Home / MOVIES / ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేసిన వర్మ ..

ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేసిన వర్మ ..

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరోసారి ఏకి పారేశాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ అజ్ఞాతవాసి.ఈ మూవీ గురించి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ నేను ఒక పులిని మాత్రమే చూశాను .

కోరలు ,పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదు .పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యపరిచింది.జంప్ చేయాల్సిన పులి పాకడం మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందిఅని వర్మ స్టైల్ లో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు .అంతే కాకుండా ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేష్ మూవీ రివ్యూ పై స్పందిస్తూ ఇప్పుడే కత్తి మహేష్ రివ్యూ వీడియోను చూశాను .పవన్ కళ్యాణ్ కంటే కత్తి చాలా అందంగా ఉన్నాడు అని ప్రశంసల వర్షం కురిపించాడు ..