రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందని భయపడుతున్నా తమ్ముళ్ళు… – Dharuvu
Home / ANDHRAPRADESH / రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందని భయపడుతున్నా తమ్ముళ్ళు…

రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందని భయపడుతున్నా తమ్ముళ్ళు…

ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు.

ఇటివల ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప కాన్వాయ్ కు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే .ఈ ప్రమాదంలో ఏకంగా చిన రాజప్ప కాన్వాయ్ ఏకంగా మంటల్లో దగ్ధమైంది .ఈ విషయం మరిచిపోకముందే సాక్షాత్తు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి ,టీడీపీ నేతల భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నారా లోకేష్ నాయుడు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.ఈ రెండు సంఘటనలు మరిచిపోకముందే తాజాగా మరో మంత్రికి ప్రమాదం జరిగింది.

టీడీపీ సర్కారు నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్ని ముగించుకొని వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామం వద్ద మంత్రి జహావర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక కారు డీకొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .అయితే ఇలా వరసగా ప్రమాదాలు జరుగుతుండంతో కనకదుర్గమ్మ గుడిలో జరిగిన పూజల ఎఫెక్ట్ వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందో అని తెలుగు తమ్ముళ్ళు తెగ భయపడుతున్నారు అంట ..