గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…! – Dharuvu
Home / ANDHRAPRADESH / గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…!

గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…!

ఆంద్ర ప్రదేశ్ లో ఈ తాంత్రిక పూజలు గొడవలు ఎక్కువ అవుతుండడం విషాదం. విజయవాడ దుర్గమ్మ గుడి లో క్షుద్ర పూజలు చేయడం పెద్ద వివాదం అయిన సంగతి తెలసిందే.తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో కూడా ఇలాగే తాంత్రిక పూజలు జరిగాయట.అక్కడ విలువైన సంపద ,నిక్షేపాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తవ్వకాలు చేపట్టడం వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోట బురుజు వద్ద నిలిచిపోయిన తవ్వకాల ప్రాంతంలో కొర్ర అన్నం, నిమ్మకాయలు ప్రసాదంగా పెట్టి దీపం వెలిగించి ఎవరో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుప్తనిధుల కోసమే.. అధికారులు ఈ పూజలు చేశారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇదే చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆ నిధుల కోసం రోజులపాటు తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ.. ఎలాంటి నిధులు బయటపడలేదు. కేవలం గుర్రం ఎముకలు, ఇటుకలు మాత్రమే లభ్యమయ్యాయి. దీంతో.. తాంత్రిక పూజలు జరిపితే.. నిధి బయటపడే అవకాశం ఉందని ఇలా చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ తతంగాన్ని ఓ యువకుడు తన సెల్‌లో బంధించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెబుతున్నారు.