మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌ కారు ప్రమాదం – Dharuvu
Home / ANDHRAPRADESH / మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌ కారు ప్రమాదం

మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌ కారు ప్రమాదం

ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్‌ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు నడిపిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.