ఆచారి అమెరికా మూవీ ఫస్ట్ లుక్ విడుదల .. – Dharuvu
Home / MOVIES / ఆచారి అమెరికా మూవీ ఫస్ట్ లుక్ విడుదల ..

ఆచారి అమెరికా మూవీ ఫస్ట్ లుక్ విడుదల ..

టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్సకత్వంలో వచ్చిన కంచె మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ .ఒకవైపు అందం మరోవైపు చక్కని అభినయం ఉన్న అమ్మడుకి ఇండస్ట్రీలో వరసపెట్టి మరి అవకాశాలు వస్తున్నాయి .

అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఓం వేంకటేశాయ మూవీలో నటించింది .తాజాగా వచ్చిన నక్షత్ర సినిమాతో తన గ్లామర్ తో కుర్రకారుని పిచ్చేక్కించింది .

ప్రస్తుతం ఈ అందాల రాక్షసి ప్రముఖ దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆచారి అమెరికా మూవీలో నటిస్తుంది.బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు .ఇటివలే ఈ మూవీకి చెందిన టీజర్ విడలైంది .ఈ రోజు ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు .ఇందులో ప్రగ్యా చాలా అందంగా ఉంది .మీరు ఒక లుక్ వేయండి ..