ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి.. – Dharuvu
Home / SLIDER / ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్‌ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.