కర్నూల్ లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..! – Dharuvu
Home / ANDHRAPRADESH / కర్నూల్ లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..!

కర్నూల్ లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..!

క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.  మృతురాలి తల్లి నాగలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి కూతరు తరళిత, కుమారుడు రితీష్‌ ఉన్నాడు.