మహేష్‌ కత్తిని నా దగ్గరకు 15 నిమిషాలు …వేణుమాధవ్ సంఛలన వాఖ్యలు – Dharuvu
Home / MOVIES / మహేష్‌ కత్తిని నా దగ్గరకు 15 నిమిషాలు …వేణుమాధవ్ సంఛలన వాఖ్యలు

మహేష్‌ కత్తిని నా దగ్గరకు 15 నిమిషాలు …వేణుమాధవ్ సంఛలన వాఖ్యలు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల గురించి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్‌ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్‌కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తా. ఆసుపత్రిలో నేనే చేర్పిస్తా. మహేష్‌ కత్తి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేంత వరకు అయ్యే ఖర్చును నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ వేణుమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోసారి మహేష్ కత్తి మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేణు మాధవ్ ఘాటుగానే హెచ్చరించాడు