Home / CRIME / హైదరాబాద్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని రష్యా దేశం నుంచి సెక్స్‌ వర్కర్లు

హైదరాబాద్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని రష్యా దేశం నుంచి సెక్స్‌ వర్కర్లు

హైదరాబాద్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడొ ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ రష్యన్‌ యువతితో సహా మరో ఇద్దరిని విడిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నయ్‌ కోడంబాక్కం ప్రాంతానికి చెందిన కురియన్‌ తారాయి జాకబ్‌ అలియాస్‌ అలెక్స్‌ టోనీ 2001లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆదాయం సరిపోక చెన్నయ్‌లో స్థిరపడ్డ అనంతపూర్‌ నివాసి రాఘవేంద్రరెడ్డి (30)తో కలిసి బంజారాహిల్స్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని బ్రోతల్‌ హౌజ్‌ నిర్వహించసాగారు. ఈ క్రమంలో 2011లో కురియన్‌ తారాయి ఓసారి బంజారాహిల్స్‌ పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు.

అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మండపేట నివాసి యామల మెర్రి, బిహార్‌కు చెందిన పంకజ్‌ కుమార్‌ మండల్‌తో కలిసి బంజారాహిల్స్‌-రోడ్‌ నెంబర్‌ 12లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు. ఒక్కో కస్టమర్‌ నుంచి కనీసం 10 వేల రూపాయల చొప్పున వసూలు చేసేవాడు. కురియన్‌ తారాయి ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతోపాటు రష్యా దేశం నుంచి కూడా సెక్స్‌ వర్కర్లను రోజుకు 16 వేల రూపాయలు ఇస్తానని కాంట్రాక్టు మీద తీసుకొచ్చేవాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆయా గృహాలపై దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులనూ అరెస్టు చేసి, రష్యన్‌ యువతితో సహా మరో ఇద్దరిని రక్షించారు. వారి నుంచి 40 వేల నగదు, రష్యన్‌ యువతి పాస్‌పోర్టు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat