జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి- ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మేయర్ .. – Dharuvu
Home / SLIDER / జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి- ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మేయర్ ..

జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి- ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మేయర్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు .శుక్రవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో ఖైరతాబాద్ ప్లై ఓవర్ మీదుగా తన కాన్వాయ్ లో వెళ్ళుతున్నారు .ఆ సమయంలో ఒక యువకుడు ప్రమాదం జరిగి ఫుట్ పాత్ పై కూర్చొని ఇబ్బంది పడుతున్న సంఘటనను చూశారు.

అంతే వెంటనే తన కాన్వాయ్ ను అపించేసి వాహనం దిగాడు మేయర్ ..దిగడంతోనే మేయర్ బాధితుడికి సపర్యలు చేశాడు .స్వయంగా మంచి నీళ్ళను తెప్పించి మరి త్రాగించాడు .కొంతసమయం తర్వాత తేరుకున్న తర్వాత మేయర్ యువకుడ్ని దగ్గర ఉండి మరి పంపించి తిరుగు వెళ్లారు .

అయితే మేయర్ చేసిన పనికి అటుగా వెళ్ళేవారు ,నగర ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు . పదవులుంటే గెలిపించిన ప్రజలనే గాలికి వదిలేసే నేతలున్న ప్రస్తుత రోజుల్లో రోడ్డు మీద పడి ఉన్న బాధితుడికి సపర్యలు చేయడం మేయర్ మంచిమనస్సుకు నిదర్శనం అని అంటున్నారు అందరు .