ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!! – Dharuvu
Home / Uncategorized / ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!

ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!

ఉద్యోగం రావాల‌నో.. పెళ్లికాని అబ్బాయిలు త‌న జీవితంలోకి మంచి అమ్మాయి భార్య‌గా రావాల‌నో, అమ్మాయిల‌యితే మంచి భ‌ర్త రావాల‌నో, త‌ల్లిదండ్రులైతే త‌మ పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ఇవ్వాల‌ని దేవుడికి ప్రార్థించేందుకు ఆల‌యాల‌కు వెళ్తుంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, పిల్ల‌లు పుట్టాల‌ని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అస‌లు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆల‌యాలు ఉన్నాయా..? అంటే.. ఆల‌యం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్త‌లు. ఆల‌యంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గ‌ర్భ‌వ‌తులు కావ‌డ‌మేంటి..? ఇదేదో మూఢ‌న‌మ్మ‌క‌మంటే మీరు పొర‌పాటుబ‌డ్డ‌ట్టే.

ఇంత‌కీ ఆ ఆల‌యం ఎక్క‌డ ఉంది..? అక్క‌డ‌కు వెళ్లిన త‌రువాత ఏం చేయాలి..? అన్న‌దేగా మీ డౌట్‌. అయితే, ఈ స‌మాచారం మీ కోస‌మే. మ‌నం చెప్పుకునే ఆల‌యం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని మండి జిల్లా భ‌రోల్ ప్రాంతంలో ఉంది. అక్క‌డ సిన్సా దేవ‌త‌ను అక్క‌డి మ‌హిళ‌లు ఎక్కువ‌గా పూజిస్తారు. ఆ ఆల‌యం ప‌రిధిలో ఉన్న కోనేటిలో మూడు మున‌క‌లు మునిగిన త‌రువాత త‌డి బ‌ట్ట‌ల‌తో ఆ ఆల‌యంలో పిల్ల‌లు పుట్ట‌ని మ‌హిళ‌లు నిద్ర చేయాల‌ట‌. అలా చేస్తే సిన్నా సేద‌వ‌త మ‌నిషి రూపంలో ఆ మ‌హిళ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆశీర్వ‌దించి వెళ్తుంద‌ని అక్క‌డి మ‌హిళ‌ల న‌మ్మ‌కం. అంతేకాదు.. నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ప్పుడు క‌ల‌లో జామ‌కాయ వ‌స్తే ఆడ‌శిశువు, బెండ‌కాయ‌, దొండ‌కాయ వ‌స్తే మ‌గ‌శిశువు పుడుతుంద‌ట‌.

ఆ మూడు కాకుండా బండ‌రాయ వ‌స్తే ఆ క‌ల‌క‌న్న మ‌హిళ త‌ల్లి కాలేద‌ట‌. ఇలా ఒక రోజు గ‌డిచాక ఇంకా ఆ ఆల‌యంలోనే ఉంటే నిద్ర చేసిన మ‌హిళ‌కు ద‌ద్దుర్లు వ‌స్తాయ‌ని అక్క‌డి మ‌హిళ‌ల న‌మ్మ‌కం. ఆ వెంట‌నే ఆ మ‌హిళ ఆ ఆల‌యాన్ని విడిచి వెళ్లిపోవాలి. ఇది మూఢ‌న‌మ్మ‌కం అనుకుంటే పొర‌పాటే. ఇప్పుడు ఈ ఆల‌యం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.