Home / Uncategorized / డోకిపర్రును దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తాం

డోకిపర్రును దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తాం

డోకిపర్రులో  సోలార్‌తో నడచే మంచినీటి పథకం ప్రారంభం
 
నాలుగు కోట్లతో నిర్మించిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ
 
ప్రారంభించిన మేఘా అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి
 
1500 గృహాలకు ఉపయోగపడనున్న మంచినీటి పథకం 
 
త్వరలో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ
 
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్పొరేట్‌ స్థాయిలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు
 
మంచినీటి పధకం ప్రారంభ సభలో పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి
 
ఘనంగా సత్కరించిన గ్రామస్తులు
విజయవాడ, జనవరి :
గ్రామస్తులు  సంపూర్ణ సహకారం అందిస్తే డోకిపర్రు గ్రామాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతమని   మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌   ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎం ఈ  ఐ ఎల్‌) అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి ప్రకటించారు.  పుట్టిన ఊరికి మేలు చేయాలనే  సదుద్ధేశ్యంతోనే తాము ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కులం, మతం,రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి తోడ్పాటునిచ్చి ఐదారు సంవత్సరాల్లో  డోకిపర్రును తొలి స్థానంలో నిలుపుతామన్నారు. ఆదివారం కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో పామిరెడ్డి కృష్ణారెడ్డి, భద్రమ్మ స్మారకార్ధం  ఎం ఈ  ఐ ఎల్‌  రూ. నాలుగు కోట్లు వెచ్చించి నిర్మించిన   తెలుగు రాష్ట్రాల్లో  సౌర విద్యుత్‌తో నడచే తొలి  సురక్షిత మంచినీటి పథకాన్ని  సంస్థ ఛైర్మన్‌, ఎండీ పీపీ రెడ్డి, పీవీ కష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో వీరిద్దరూ మాట్లాడారు. పీపీ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన ఊరిపై ఉన్న మమకారంతో తాము ఇవన్నీ చేస్తున్నామని అన్నారు. గ్రామంలో ఎవ్వరూ ఏమీ అడగకపోయినా తాము అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అడగకపోయినా అభివృద్ధి చేస్తున్నారని ఎవ్వరూ భావించవద్దని అన్నారు. తాము కోట్లాది రూపాయలు వెచ్చింది మంచినీటి పథకాన్ని నిర్మించి ప్రారంభిస్తుంటే  వేల సంఖ్యలో జనభా ఉన్న గ్రామం నుంచి  వందల సంఖ్యలో సభకు వచ్చారని అవేదన వ్యక్తం చేసిన ఆయన తాము ఏదో ఆశించి ఇదంతా చేయటం లేదన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ తమ  కుటుంబసభ్యునిగా భావించి వారికి మెరుగైన  సౌక్యుం కల్పించాలనే ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పెద్ద పెద్ద  పట్టణాలు, నగరాలకు మాత్రమే  పరిమితమైన ర్యాపిడ్ ఫిల్టర్ బెడ్‌ సౌక్యర్యాన్ని డోకిపర్రులో ఏర్పాటు చేశామన్నరు. సురక్షిత మంచినీటిని తాగటం వల్ల అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని అన్నరు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్‌ ద్వాం శుద్ధి చేసిన  నీటిని ,  శుద్ధి చేయని నీటిని ఆయన సభలో ప్రదర్శించారు. గ్రామంలో ప్రతి ఇంటికీ ఉచితంగా మంచినీటిని అందిస్తామని,  మంచినీటి నల్లాలేని వారు దరఖాస్తు చేసుకొమ్మంటే తొలుత ఎవ్వరూ ముందుకు రాలేదని, ఆ తరువాత ఒక్కొక్కరూ   స్పందించారని ఈ సందర్భంగా గుర్తు  చేశారు. 1985లో గ్రామంలో  రక్షిత మంచినీటి సరఫరాకు టెండర్లు పిలిస్తే తాను అప్పుడు పనిచేసే కంపెనీ తరపున టెండర్‌  వేద్దామని  ప్రయత్నిస్తే కొందరు  ఈ పని  మీరు చేయలేరని  చెప్పారని గుర్తు చేశారు.  ఊరికి మంచినీటిని అందించాలని అపుడే ఒక నిర్ణయానికి వచ్చిన తాను ఇప్పుడు పూర్తి చేయగలిగానని  అన్నరు. డోకిపర్రు చుట్టూ పెద్ద పెద్ద  చెరువులు ఉన్నా నీటిని రక్షించుకోలేకపోవటం,  వ్యర్థాలను నీటిలో వదిలి పెట్టడం వల్ల ఇప్పుడు స్వచ్ఛమైన తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
ప్రస్తుతం ప్రారంభించిన  నీటి పథకం వల్ల ఇక నుంచి గ్రామస్తులకు అలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. గ్రామంలో తాము చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేస్తామని,  స్థానికంగా ఉన్న సన్న, చిన్నకారు రైతు, వ్యవసాయ కూలీలను తమ పిల్లలను  ఉన్నత చదువులు చదివించేందుకు అనువుగా జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరామన్నారు. అనుమతులు మంజూరైన వెంటనే కళాశాలను ప్రారంభిస్తామన్నారు. మేఘా ఎండీ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఎలాంటి ప్రతి ఫలాన్ని ఆశించకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని అన్నారు. కుల, మత, పార్టీ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చన్నారు. లంకకు వెళ్లిన లక్ష్మణుడు ఇక్కడ బాగుంది … ఇక్కడే  ఉందామని  అంటే రాముడు జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరియసి అని చెప్పారని… దీని అర్థం జన్మభూమి కంటే మరే ప్రాంతం గొప్పకాదని అన్నారు. తాము  ఎక్కడ ఉన్నా   సొంత ఊరిపై ప్రేమతో ఇవన్నీ చేస్తున్నమని అన్నారు..ఇదే గ్రామానికి చెందిన సీఐడి ఎస్‌పీ కాళిదాసు వెంకట రంగారావు మాట్లాడుతూ  ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న  ప్రతి ఒక్కరికి పరోపకారం చేసే గుణం ఉండదని, అలా చేసే వారికి సంపూర్ణ సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  పీపీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నతస్థాయికి వెళ్లాలనుకుంటే ఆయనకున్న పలుకుబడితో రాజ్యసభ  సభ్యుడు ఎప్పుడో అయ్యేవారని, అయితే వారికి సేవాభావం తప్ప మరో ఉద్ధేశ్యం లేదన్నరు.  స్థానికుడు శివప్రసాద్‌ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టును నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేసిన గత రెండు సంవత్సరాలుగా కృష్ణా డెల్టాలోని 13.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన మేఘా సంస్థ అధిపతులకు జిల్లా రైతాంగం,  వ్యవసాయ కూలీల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. పట్టిసీమ వల్లే ఈ  ప్రాంతానికి చెందిన రైతు ఎకరాకు 30 నుంచి 40 బస్తాల ధాన్యం పండించగలుగుతున్నారని చెప్పారు. స్థానికుడు అప్పారావు మాట్లాడుతూ 1985లోనే మంచినీటిని గ్రామానికి అందించాలని ప్రజల నుంచి  డబ్బులు వసూలు చేసినా వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదన్నరు. తము అప్పుడు చేసిన ప్రయత్నం మేఘా సంస్థ ద్వారా  ఇప్పుడు తీరిందన్నారు. పి. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కృష్ణార్జునులని అన్నారు. సభలో ప్రసంగించిన పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు  వీరిరువురితో పాటు  గ్రామ మాజీ సర్పంచ్‌ పి.వీరారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీపీరెడ్డి సతీమణి రమారెడ్డి, పీవీ కృష్ణారెడ్డి సతీమణి సుధారాణి, నాగేశ్వర్ రెడ్డి, క్షీరసాగర్ రెడ్డి, గ్రామ సర్పంచ్‌  జోగి వెంకటేశ్వరరావు,  ఎమ్మార్వో  స్వర్ణకుమారి, పంచాయితి  కార్యదర్శి రమణ, రామిరెడ్డి, శివప్రసాద్‌, పూర్ణ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat