కన్న బిడ్డల కళ్ళముందే భార్యను అతి కిరాతకంగా …! – Dharuvu
Breaking News
Home / NATIONAL / కన్న బిడ్డల కళ్ళముందే భార్యను అతి కిరాతకంగా …!

కన్న బిడ్డల కళ్ళముందే భార్యను అతి కిరాతకంగా …!

ప్రస్తుత రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడకు వెళ్ళిన కానీ క్షేమంగా తిరిగి వస్తారు అనే భరోసా లేని రోజుల్లో నేటి మహిళలు తమ జీవితాన్ని గడుపుతున్నారు .ప్రేమించే ప్రేమికుడు దగ్గర నుండి కట్టుకున్న భర్త వరకు అందరి చేతుల్లో తమ ప్రాణాలను కోల్పోతున్నారు .తాజాగా దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

కట్టుకున్న భార్యను కన్న బిడ్డల కళ్ళ ముందు హత్య చేయడం కాకుండా ఏకంగా కన్నకొడుకును కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు .అసలు విషయానికి వస్తే ఢిల్లీలో జహాన్ గిర్ పురి ప్రాంతంలో నివాసం ఉంటున్న సునీత ఆమె కుమారుడు (18నెలలు )ను భర్త ప్రకాష్ బలమైన ఆయుధంతో కొట్టి మరి చంపాడు .

ప్రకాష్ సోదరుడు ఇంటికి వెళ్లి తలుపు ఎంత సేపు కొట్టిన ఎవరు కూడా బయటకు రాకపోవడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు .దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు సునీత ,పట్టుమని రెండు ఏండ్లు కూడా లేని కుమారుడి శవంతో పాటుగా మరో ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు .పోలీసులు విచారించగా చిన్నపిల్లలు తమ తండ్రే స్వయంగా అమ్మను ,తమ్ముడ్ని అతి కిరాతకంగా చంపాడు అని తెలిపారు అని పోలీసులు తెలిపారు .నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు .