Home / CRIME / పదేళ్ల నుంచి వ్యభిచారం….హైదరాబాదులోగత రెండేళ్లుగా ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచారం

పదేళ్ల నుంచి వ్యభిచారం….హైదరాబాదులోగత రెండేళ్లుగా ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచారం

ఈ మద్య నగరాలల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభీచారం జరుగుతున్నది. తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఫయీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఫయీజ్ జూబ్లీహిల్స్‌లోని ఓ డూప్లెక్స్ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పక్క సమాచారం పోలీసులకు అందడంతో దాడులు నిర్వహించారు.ఈ దాడులలో కోల్‌కతా, గోవా, ముంబై ప్రాంతాల నుంచి యువతులను వారం, పది రోజుల పాటు హైదరాబాదుకు తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పదేళ్ల నుంచి ఫయీజ్ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే హైదరాబాదులో మాత్రం గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడి నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులు, మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సూత్రధారి ఫయీజ్‌తో పాటు అతనికి సహకరించిన జోసఫ్, సురేష్ అనే మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితల నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat