తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం .. – Dharuvu
Breaking News
Home / SLIDER / తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..

తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..

తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు.

కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల కోసం 108 బైక్ అంబులెన్స్‌లు.. అదేవిధంగా ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద గ్రామాల్లో వైద్య సేవలిందించేందుకు ఏఎన్‌ఎంలకు వాహనాలను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు.