వ‌ర్మ పూర్తిగా బ‌ట్ట‌లు విప్పేసిన క‌థ‌.. మ‌రొక‌రి ద‌గ్గ‌ర లేపేశాడా.. అది ప‌విత్రంగా రాసుకున్న క‌థనా..? – Dharuvu
Breaking News
Home / MOVIES / వ‌ర్మ పూర్తిగా బ‌ట్ట‌లు విప్పేసిన క‌థ‌.. మ‌రొక‌రి ద‌గ్గ‌ర లేపేశాడా.. అది ప‌విత్రంగా రాసుకున్న క‌థనా..?

వ‌ర్మ పూర్తిగా బ‌ట్ట‌లు విప్పేసిన క‌థ‌.. మ‌రొక‌రి ద‌గ్గ‌ర లేపేశాడా.. అది ప‌విత్రంగా రాసుకున్న క‌థనా..?

మిస్ట‌ర్ జీనియ‌స్ వివాదాస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ర‌చ్చ రంబోలాకి తెర‌లేపారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే అడల్ట్ స్టొరీని తెరకెక్కించాడు. ప్ర‌ముఖ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో పూర్తిగా నగ్న షో చేయించాడు వర్మ. ఇటీవ‌ల కొద్ది రోజ‌ల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించగా.. తాజాగా విడుద‌లైన ఈ చిత్ర‌ ట్రైలర్ హాట్ ఫ్యాన్స్ గుండెల్లో కాక రేపుతోంది.

ఇక పూర్తిగా నగ్న‌ షోగా సాగిన ఈ ట్రైలర్ పై విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. యువత ని పెడ త్రోవ పట్టేలా వర్మ చేస్తున్నాడని ఘాటు విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ పై ర‌చ‌యిత పి. జ‌య‌కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇంతకీ ఈ జయకుమార్ ఎవరో కాదు…సర్కార్ 3 సినిమాకి కథ అందించిన వ్యక్తి అవడం విశేషం. ట్రైలర్ చూసిన తర్వాత స్పందించిన జయకుమార్ తన రచనను వర్మ కాపీ కొట్టాడని అంటున్నాడు.

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్.. ఎంతో పవిత్రంగా స్క్రిప్ట్ ని రాసుకుంటే దాన్ని బూతుగా మార్చి నా కథని అభాసు పాలు చేసాడని వ‌ర్మ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు జ‌య‌కుమార్‌. వర్మ రూపొందించినట్లుగా బూతు పురాణం లా నేను స్క్రిప్ట్ ని రాయలేదని.. వర్మ మాత్రం నా స్క్రిప్ట్‌కి పూర్తిగా బ‌ట్ట‌లు విప్పి త‌న స్టైల్‌లో ప‌ని కానిచ్చేశాడ‌ని వర్మ పై నిప్పులు చెరుగుతున్నాడు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల పై వ‌ర్మ‌ స్పందిస్తాడా… లేక‌ దున్నపోతు మీద వర్షం పడ్డట్లు లైట్ గా తీసుకుంటాడా అనేది చూడాలి.