చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే అండ్ బ్యాచ్ ఆశ‌లు గ‌ల్లంతు అవుతాయ‌ని తేల్చేస్తున్నారు విశ్లేష‌కులు.

ఇక ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేసుల విచార‌ణ జ‌రుగుతున్న తీరును ప‌రిశీలిస్తే.. మాత్రం బాబు అండ్ కో ఆశ‌లు తీర‌వ‌ని… జ‌గ‌న్ పైన న‌మోదైన కేసుల‌తో సంబంధం ఉన్న ఐఏఎస్ అధికారులు ఒక్కొక్క‌రుగా కేసుల నుంచి క్లీన్ చిట్ అందుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్నారని ప‌రిశీల‌కు చెబుతున్నారు. ఎమ్మార్ కేసు స‌హా పలు కేసుల్లో ఇదే జ‌రిగింది. తాజాగా ఐఏఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ఈ కేసు నుంచి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో రాబోయే ఆరు మాసాల్లో జ‌గన్‌ను కూడా ఈ క్ర‌మంలోనే కోర్టు చాలా కేసుల నుంచి బ‌య‌ట‌పడేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇటీవ‌ల 2జీ కేసులో క‌నిమొళి, రాజాల‌కు ల‌భించిన క్లీన్ చిట్ మాదిరిగానే జ‌గ‌న్ కూడా సేఫ్‌గా బ‌య‌ట ప‌డ‌తాడ‌ని, అప్పుడు చంద్ర‌బాబు అండ్ కో ఆశ‌లు గ‌ల్లంతే అని.. వైసీపీ శ్రేణ‌లు బల్ల గుద్ది మరి చెప్తున్నారు. మరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్తతో బాబు అండ్ బ్యాచ్‌కి మాత్రం మింగుడు ప‌డ‌డం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.