Home / ANDHRAPRADESH / చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కి ఊహించ‌ని షాక్‌.. సంచ‌ల‌నం రేపుతున్న‌ రిప‌బ్లిక్ మీడియా స‌ర్వే రిపోర్ట్..!

చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కి ఊహించ‌ని షాక్‌.. సంచ‌ల‌నం రేపుతున్న‌ రిప‌బ్లిక్ మీడియా స‌ర్వే రిపోర్ట్..!

ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో రిప‌బ్లిక్ మీడియా విడుద‌ల చేసిన స‌ర్వే రిపోర్ట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఉన్న‌ప‌లంగా ఏపీలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి 13 పార్ల‌మెంట్ స్థానాలు ద‌క్క‌నున్నాయ‌ని రిప‌బ్లిక్ స‌ర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్టు అయ్యింది.

ఇక ఏపీలో గ‌త ఎన్నికల రిజ‌ల్ట్ మ‌నం గ‌మ‌నిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న ఎన్నిక‌ల్లో మ‌రో 5 స్థానాలు మెరుగుప‌ర్చుకోనుంద‌ని ఆ స‌ర్వే చెబుతోంది. ఈ నేప‌ధ్యంలో టీడీపీ ఓట్ల శాతాన్ని వైసీపీ గ‌ణ‌నీయంగా కొల్ల‌గొట్ట‌నుందని ఆ స‌ర్వేలో తేలింది. ఇక 2014లో బీజేపీ + టీడీపీ అల‌య‌న్స్‌కి 17 పార్లమెంట్ స్థానాలు ద‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే ఈసారి అదే కూట‌మి కంటిన్యూ అయినా.. 12 పార్ల‌మెంట్ స్థానాల‌కే ప‌రిమితం కానున్నాయ‌ని.. ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని.. వివ‌రాల‌తో ఆ స‌ర్వే తేల్చేసింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మా పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని డ‌బ్బా కొడుతున్న‌ ఎల్లో గ్యాంగ్ గుండెల్లో ఆందోళ‌న మొద‌లైంది.

ఇక మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణలో మ‌రోసారి కేసీఆర్ స‌ర్కార్ కొట్టే పార్టీ క‌నుస‌న్న‌ల్లో కూడా లేద‌ని.. తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండోసారి కూడా గులాబీ జెండాని ఎగురవేయడం ఖాయమని సర్వే వెల్లడించింది. ఇక‌పోతే టీఆర్ఎస్ 12 పార్లమెంట్ స్థానాలు సాధిస్తుందని, బిజెపికి- 3, కాంగ్రెస్‌కి- 2 పార్లమెంట్ స్థానాలే దక్కుతాయని ఆ స‌ర్వే పేర్కొంది. దీంతో తెలంగాణాలో గులాబీ దళంలో జోష్ పెంచితే కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సహాన్ని నింపింది. ఇక ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ కూడా మ‌రోసారి అధికారం దక్కించుకుంటుందని.. మోడీ స‌ర్కార్ తిరిగి గద్దెనెక్కుతుందని రిపబ్లిక్ తేల్చింది. ఏదిఏమైనా రిప‌బ్లిక్ స‌ర్వే విడుద‌ల చేసిన తాజా స‌ర్వే రిపోర్ట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat