Home / MOVIES / నాగ శౌర్య‌తో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగ‌బాబు రివ‌ర్స్‌..?

నాగ శౌర్య‌తో- నిహారిక పెళ్లి.. ఒప్పేసుకున్న చిరంజీవి.. నాగ‌బాబు రివ‌ర్స్‌..?

మెగా బ్రాద‌ర్ నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి మెగా మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ఖాయ‌మైంద‌ని పుకార్లు ఓ రేంజ్‌లో షికార్లు చేశాయి. అయితే ఆ టైమ్‌లో తేజూ డైరెక్ట్‌గా స్పందించ‌డంతో ఆ రూమ‌ర్ అక్క‌డితో ఆగిపోయింది. తేజూకి ఇలాంటి రూమ‌ర్లు మామూలే అయినా మెగా డాట‌ర్ గురించి ఫ‌స్ట్ టైమ్ రూమ‌ర్ రావ‌డంతో గూగుల్ మొత్తం ఒక్క‌సారిగా ఊగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మ‌రోసారి మెగా డాట‌ర్ గురించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో స్వింగ్ అవుతోంది. అయితే ఈసారి అబ్బాయి మెగా ఫ్యామిలీ నుండి కాదండోయ్‌.. నిహారిక న‌టించి తొలిచిత్రం హీరో నాగ‌శౌర్య‌తో. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. నీహారిక, నాగశౌర్య మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం నడుస్తోందట. ఇద్దరూ ఒక మనసు సినిమా టైమ్‌లో ల‌వ్ స్టార్ట్ అయ్యింద‌ట‌.. అయితే ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయినా వీళ్ల ప్రేమ మాత్రం ఫుల్ ట్రాక్‌లో నడిచిందట‌.

ఈ విష‌యం మెగా ఫ్యామిలీకి తెలియ‌డంతో.. సీరియ‌స్ అయిన నాగ‌బాబు వీళ్లిద్దరి పెళ్లికి అంగీకరించలేదట‌.. అయితే ఈ వ్య‌వ‌హారం నేరుగా మెగాస్టార్ చిరంజీవి ద‌గ్గ‌ర‌కు వెల్ల‌డంతో.. ఆయ‌న కొంచెం టైమ్ తీసుకొని వారి పెళ్లికి ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.. దీంతో నాగ‌బాబు కూడా ఒప్పేసుకున్నాడ‌ని.. కులాంతర వివాహాలు మెగా కుటుంబంలో కొత్తేమీ కాకపోవడంతో, వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ నిహా- శౌర్య పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ నేప‌ధ్యంలోనే ఛలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు శౌర్య త‌న త‌ల్లితో స‌హా చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయ‌న్ని ఆహ్వానించార‌ట‌. దీంతో ఆ ఫంక్ష‌న్‌కి చిరు వెళ్ళ‌డ‌మే కాకుండా నాగశౌర్య అందగాడే కాక.., సరైన సినిమాలు పడితే టాలీవుడ్‌కి మంచి స్టార్ అవుతాడని స‌న్నిహితుల వ‌ద్ద చెప్పాడ‌ట‌. ఇక అంతే కాకండా ఇండస్ట్రీలో నాగశౌర్యకు మంచి పేరే ఉందని… అతనికిచ్చి వివాహం జరిపిస్తే మంచిదేన‌ని, తాను చేసిన తప్పును చేయొద్ద‌ని నాగబాబుకు గ‌ట్టిగా చెప్పాడ‌ట అన్న‌య్య‌. దీంతో నాగబాబు కూడా కూల్ అయ్యి ఒప్పేసుకున్నాడ‌ట‌.. ఇదండీ ప్ర‌స్తుతం మెగా బ్ర‌ద‌ర్‌ కూతురు నిహారిక‌తో నాగ‌శౌర్య పెళ్లి వార్త.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ట్రెండింగ్ వార్త మ‌రి ఈ వార్త నిజ‌మో రూమ‌రో ఎవ‌రైనా స్పందిస్తే కానీ తెలియ‌దు.

..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat