Home / ANDHRAPRADESH / వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు

వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు

వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ రోజులు మారతాయని భరోసా ఇచ్చారు.

see also..టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజీనామా..!!

చేవెళ్ల నుంచి మొదలైన ఆ ప్రజానేత ప్రస్థానం ఇచ్ఛాపురం వరకూ అప్రతిహతంగా సాగింది. ఎండా వానే కాదు, అలసట, అనారోగ్యం కూడా ఆయన ప్రజాభిమానాన్ని ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. మహాపాదయాత్రకు ఆటంకం కలిగించలేకపోయాయి. ఆ ప్రస్థానమే ప్రజా ప్రభంజనమై వైయస్సార్ ను రాష్ట్రాధినేతను చేసింది. ఆ పాదయాత్ర లో వైయస్ రాజశేఖర్ రెడ్డిని కదిలించిన ప్రతి వేదనకూ ఆయన పరిపాలన ఒక సమాధానమైంది. రైతులు, కార్మికులు, నేతన్నలు, కూలీలు, మత్స్యకారులు, గీతకార్మికులు ఇలా అన్ని వర్గాలకూ చెందిన వారి కష్టాలను మనసుపెట్టి విన్నాడు ఆ మారాజు. ప్రభుత్వం పరిపాలనా పరంగా చేసే తప్పులు తెలియక కాదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసింది. ఆ పరిపానలో ప్రజలకు ఎదురౌతున్న సమస్యలను అంచనా వేసేందుకే ఆయన పాదయాత్ర చేసారు. వారి కష్టాలను గట్టెక్కించే మార్గం ఉందని వారికి తెలయజేసేందుకే పాదయాత్ర చేసారు. అది చరిత్ర మరిచిపోని ఓ సువర్ణ అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తొలి పాదయాత్రగా లిఖించబడిన ప్రస్థానం. కాలం పగబట్టి రైతుబాంధవుడు ప్రజలకు దూరమైపోయాడు. అదే కాలం మభ్యపెట్టడంతో మరోసారి విపరీత కాలం దాపురించింది. ఎవరి అన్యాయపూరిత పాలనను అంతం చేసి వైయస్ ముఖ్యమంత్రి అయ్యారో, అదే మనిషి తిరిగి గద్దెనెక్కారు. మోసం చేయడంలో ఏళ్ళకు ఏళ్లు అనుభవం ఉన్న నాయకుడికి ప్రజలు మరోసారి బలయ్యారు. ప్రజలు నమ్ముకున్న వైయస్ కుటుంబంపై కక్ష సాధింపులు మొదలయ్యాయి. అర్థం లేని ఆరోపణలతో వైయస్ జగన్ ను జైలుకు పంపించారు. ఇన్ని జరిగినా ఆ ఇంటికి ప్రజలపై ఉన్న ప్రేమ చెక్కు చెదరలేదు. ఆత్మవిశ్వాసం అణువంతైనా తగ్గలేదు.

see also..వ‌ర్మ చెక్కిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఎన్ని కోట్లు కొల్ల‌గొట్టిందో తెలుసా.?

వైయస్ ఆశయాల వారసుడు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్నయాత్ర చేస్తున్నాడు. తండ్రి రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, టిడిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఈ పాదయాత్ర సాగతుంది. ఈ యాత్రపూర్తి అయితే వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర అవుతుంది. పాదయాత్ర పేరు వింటే పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపు దార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అవినీతి గ్లోబు చంద్రబాబు బుర్రైతే గిర్రున తిరుగుతోంది. కేసులు, కోర్టు హాజరీ, అసెంబ్లీని బహిష్కరించడం వంటి అంశాలతో పాదయాత్ర పేరును చెడగొట్టాలని ఎల్లోగ్యాంగ్ ఇంకా కొన్ని తోక పత్రికలు ప్లాన్ చేసుకుంటున్నాయి. కాని ఈ ఎత్తులు, జిత్తులూ ప్రజా సంకల్పం ముందు దూదిపింజలై తేలిపోతాయని తేలడానికి ఎంతో కాలం పట్టదు. వైయస్సార్ కుంటుంబంలో భాగస్వాములై ఇంటింటికీ వచ్చిన టిడిపి నేతలను నిలదీసి, వెనుతిరిగి పోయేలా చేసిన ప్రజలు పాదయాత్రలో ప్రతిపక్ష నేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. యువనేతలో తమ ప్రియతమనేతను చూసుకోవాలని ఆరాటపడుతున్నారు. ప్రజా సంకల్పం టీడీపీ అవినీతి పాలనపై ఇది మరో సమర శంఖం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat