Home / TELANGANA / మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు

మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు ( చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు) గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు.

బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల​ సీపీఆర్‌ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ మంత్రి కేటీఆర్‌ ఆ వీడియోను పోస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..నిన్న( బుధవారం) ఉదయం పురానాపూల్‌ మీదుగా జహనుమా వైపు బైక్‌ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. అయితే..ఆ సమయంలో అక్కడే విధులు నిరహిస్తున్నచందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు వెంటనే హఠాత్తుగా కిందపడిపాయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అయన ఛాతీ పై మసాస్‌ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు.ఈ సందర్బంగా నిజాయితీ గా విధులు నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన ఈ ఇద్దరిపై అక్కడ వున్నా స్థానికులే కాకుండా మంత్రి కేటీఆర్ కూడా వారిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

see also : 2019 లో ముఖ్యమంత్రి కానున్న వైఎస్ జగన్..! ఇవిగో సాక్ష్యాలు.!!

see also : బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat