ఈ ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు – Dharuvu
Breaking News
Home / BUSINESS / ఈ ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు

ఈ ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు

ప్ర‌స్తుతం మొబైల్స్ కంప‌నీలు త‌క్క‌వ ధ‌ర‌ల‌తో క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్శిశిస్తున్నాయి. విడుద‌ల చేసిన‌ప్పుడు ధ‌ర‌ కాకుండా …మ‌ద్య‌లో అదే మొబైల్ ను మ‌రింత ధ‌ర త‌గ్గించిన‌ట్టు ప్ర‌క‌టించి…క‌ష్ట‌మ‌ర్ల‌ను కోనుగోలు చేసే విదంగా చేస్తారు. తాజాగా నోకియా 5, నోకియా 8 స్మార్ట్‌ఫోన్లపై భారత్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ ధరలు తగ్గించింది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 8 వేల రూపాయల ధర తగ్గించి రూ.28,999కు తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్‌ను గతేడాది అక్టోబర్‌లో లాంచ్‌ చేసినప్పుడు రూ.36,999గా ఉండేది. అంతేకాక నోకియా 5 (3జీబీ వేరియంట్‌) స్మార్ట్‌ఫోన్‌పై కూడా వెయ్యి రూపాయలు ధర తగ్గించి, రూ.12,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

నోకియా 5 స్పెషిఫికేషన్లు..
5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ ప్యానల్‌
ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
3 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోకియా 8 స్పెషిఫికేషన్లు….
5.3 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ