లవర్స్ డే గిఫ్ట్ గా రెడ్ మీ మరో స్మార్ట్ ఫోన్ – Dharuvu
Breaking News
Home / BUSINESS / లవర్స్ డే గిఫ్ట్ గా రెడ్ మీ మరో స్మార్ట్ ఫోన్

లవర్స్ డే గిఫ్ట్ గా రెడ్ మీ మరో స్మార్ట్ ఫోన్

ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షీయోమి మరో నూతన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5 ప్లస్ ను ఈ నెల పద్నాలుగు తారీఖున విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అంతే కాకుండా దీనికి సంబంధించి అతి పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ..
రెడ్ మీ5 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే ను కల్గి ఉండి 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది .అంతే కాకుండా 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2&3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ. సామర్ధ్యాన్ని కల్గి ఉంటుంది.

షియోమీ రెడ్‌మీ 5 ప్లస్/నోట్ 5 ఫీచర్లు…

రెడ్ మీ 5+ 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీలను కల్గి ఉంటుంది .