Home / ANDHRAPRADESH / రైతులిచ్చిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. ..

రైతులిచ్చిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. ..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.తాజాగా వైసీపీ శ్రేణులు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన వెలగపూడి,రాయపూడి,మందడం గ్రామాల్లో భూములను అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు..

రాజధాని ప్రాంతానికి భూములివ్వకుండానే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే భారీ నజరానాను లబ్ది పొందిన గౌస్ ఖాన్ ఉదంతం బయటకు రావడంతో అర్ధమవుతుంది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు రాజధాని ప్రాంత రైతులు మొత్తం ముప్పై ఆరు వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా ఇచ్చారు . అయితే రాజధానికి భూములిచ్చిన రైతుల పేరిట రెసిడెన్సియల్ ఫ్లాట్లు ,కమర్షియల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి సీఅర్డీఏ అధికారులు ప్లాన్ చేశారు.

అయితే ఈ వ్యవహారంలో భూములిచ్చిన రైతులకంటే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తల పేరిట రెసిడెన్సియల్ ఫ్లాట్స్,కమర్షియల్ ఫ్లాట్స్ ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది.అయితే రైతుల పేరిట ఉన్న రికార్డ్లను అన్ని తారుమారు చేసి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తల పేరిట నమోదు చేశారని సీఆర్డీఏ అధికారులే స్వయంగా చెప్పడం ఇక్కడ గమనార్హం . ఈ వ్యవహారం మీద సీఆర్డీఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఉన్న పలువురు కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ లైన్ రికార్డులను తారుమారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అదనపు కమిషనర్ షణ్ముకంను విచారణ చేయిస్తామని అన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat