రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి. రెండోది గేదె పాల‌తో త‌యారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవ‌లం ఆవు నెయ్యిని మాత్ర‌మే ఔష‌ధాల ప్ర‌యోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మ‌న శ‌రీరానికి క‌లిగే పలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నయం చేసే గుణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?

  • ఆవు నెయ్యి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
  • క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజూ నెయ్యి తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.
  • కంటి సంబంధిత వ్యాధితో భాధపడే వారు నెయ్యి ని ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఎందుకంటే ఇందులో మిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.
  • నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు..మంచి కొలెస్ట్రాల్ ను మాత్రమే పెంచుతుంది.దీంతో  గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

see also : గర్బిణీలు జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే

  • ఉదయం పూట ఏమి తీసుకోకుండా  ఆవు నెయ్యిని తాగ‌డం వ‌ల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మెద‌డుకు కావ‌ల్సిన శ‌క్తి అంది జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.
  • గర్భిణిలైతే నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలంటున్నారు వైద్యులు .ఎందుకంటే ఎదిగే పిండానికి కీలక పోషకాలు అందాలంటే  నెయ్యి తప్పనిసరి.
  • నెయ్యి తీసుకోవడం వల్ల మొఖంపై వున్నా మచ్చలు,ముడుతలు,మొటిమలు పోతాయి.అంతే కాదు నెయ్యి ని రోజు తింటుంటే మొఖం కాంతి వంతంగా మారుతుంది.
  • ఆవు నెయ్యిని రోజూ తాగితే కీళ్ల‌లో లూబ్రికేష‌న్ అవుతుంది. దీని ఫ‌లితంగా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

see also : తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

see also : సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా …!