తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

పకృతి సిద్దంగా దొరికే తులసి ఆకుల్లో లాభాలు అన్ని ఇన్ని కావు.ప్రతి ఇంట్లో తులసి మొక్క వుంటుంది.అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ప్రతీ రోజు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

  • తులసి ఆకులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల హానికరమైన మలినాలను బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
  • మెదడు పని తీరును మెరుగు పడేలా చేస్తుంది.

see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?

  • తుల‌సి ఆకుల‌ను రోజూ తీ సుకోవడం వలన దంత స‌మ‌స్య‌లు, చిగుళ్ల బాధ‌లు రావు
  • రోజు 10 నుంచి 12 తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటుంటే ర‌క్తం శుద్ధి అవుతుంది.
  • ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట‌రాల్‌ను త‌గ్గించ‌డంలో, గుండె జ‌బ్బులు రాకుండా చూడడంలో తుల‌సి ఆకులు అద్భుతంగా ప‌నిచేస్తాయి.
  • తుల‌సి ఆకుల‌ను ర‌సంగా చేసి దానికి తేనెను క‌లిపి తాగుతుంటే కొద్ది రోజుల్లోనే కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి.
  • కడుపు నొప్పితో భాధపడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ తులసి రసంలో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని కలిపి తీ సుకోవడం వల్ల కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
  • కొంతమంది మొటిమల సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారు తులసి ఆకులను మెత్తగా నూరి అందులో కొద్దిగా నిమ్మరసాన్ని ,చిటికెడు పసుపు కలిపి పుతగా వేసుకోవాలి ఒక అరగంట తరువాత కడిగి వేయాలి.ఇది చర్మంలో ఉన్న బ్యాక్టీరియా ని నివారిస్తుంది.మొటిమలను తగ్గించడమే కాకుండా మొఖాన్ని కాంతి వంతంగా ఉంచుతుంది.

see also :సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా …!

see also :గర్బిణీలు జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే